గూగుల్ సీఈవో కీలక నిర్ణయం.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్..!

-

గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలున్నాయి. భారతదేశంలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఆఫీసులు ఉన్నాయి. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గూగుల్ పని చేస్తున్న ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో గూగుల్ ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనుననట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల కోసం ఆపీసులలో సదుపాయలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా కసరత్తులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో గూగుల్ లో పని చేస్తున్న 62 శాతం మంది ఆఫీస్ కి రావాలని ఉన్నా… రోజు మాత్రం రావాలని లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు తాము నివసిస్తున్న ప్రదేశాల్లోనే సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారు అప్పుడప్పుడు ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. 2021 జూలై వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని ప్రకటించిన తొలి కంపెనీల్లో గూగుల్ కూడా ఉన్నట్టు సుందర్ పిచాయ్ గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version