గూగుల్‌ 1337 కోట్ల జ‌రిమానా 30 రోజుల్లో క‌ట్టాల్సిందే..

-

టెక్ దిగ్గజం అయిన గూగుల్‌కు సుప్రీంకోర్టు గట్టి దెబ్బ కొట్టింది. జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ) తీర్పును వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఆండ్రాయిడ్ ఉత్పత్తులకు సంబంధించి తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, అనైతికంగా, పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో రూ. 1337 కోట్ల పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించింది గూగుల్. అక్కడ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగానే తీర్పు రావడం జరిగింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో జమ చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది .

ఎన్‌సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ గూగుల్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్థివాలా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును తిరిగి ఎన్‌సీఎల్ఏటీకి అప్పగించింది. అంతేగాక, మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలియపరిచింది.
గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పెనాల్టీలో 10 శాతం డిపాజిట్ చేసేందుకు గూగుల్‌కు ఏడు రోజుల పాటు గడువును విధించింది ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం. అంతేగాక, కేసు విచారణ కోసం గురువారం నుంచి మూడు రోజుల్లోగా ఎన్‌సీఎల్ఏటీని సంప్రదించాలని గూగుల్ ను ఆదేశించింది సుప్రీమ్ కోర్ట్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version