మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు…

-

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేపట్టారు . ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్ అని వ్యక్తపరిచారు అయన. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను మించి జగన్ సంక్షేమ పథకాలు తీసుకువచ్చాడని అన్నారు కోడలి నాని. వారిద్దరూ ఒకడుగు వేస్తే, జగన్ రెండడుగులు వేశారని వెల్లడించారు.
“జగన్ అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ విస్తరణ, పాఠశాలల ఆధునికీకరణ, వసతి దీవెన తీసుకువచ్చారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకువస్తే, జగన్ గ్రామాలను యూనిట్లుగా తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేశారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారు. రైతుల కోసం ఆర్బీకేలను ప్రారంభించారు. రైతులకు పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు” అని కొడాలి నాని తెలియచేసారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత సీఎం నందమూరి తారక రామారావు పేరును స్మరిస్తూనే ఉంటుందని, మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎన్టీఆర్ ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి ఉంటుంది అనేదే సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను ఎందుకు కాళ్లు పట్టుకు లాగేశారు అనేది మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎందుకు ఎన్టీఆర్ పై చెప్పులత దాడి చేయించారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ ను ఎందుకు సస్పెండ్ చేసి పార్టీ నుంచి గెంటేశారో కూడా చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ కు అభివృద్ధి పైనే దృష్టి ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వండి అని అడిగిన కూడా.. సీట్ కష్టం అని నిజాయితీ గా జగన్ చెప్పారని గుర్తు చేశారు. జగన్ అవకాశవాద రాజకీయాలు చెయ్యడని, 2019 లో దేవుడు రాసిన స్క్రిప్ట్ 23 మందిని కొంటే.. 23 టీడీపీకి ఇచ్చాడని, 2024 లో కూడా ఇప్పుడు నలుగురిని కొన్న చంద్రబాబుకు నాలుగే వస్తాయని, ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ కి ఇద్దరు ఎమ్మెల్యేలు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version