సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే యాప్‌ను తొలగించారు. యాప్ స్టోర్‌లో ప్రస్తుతం గూగుల్ పే యాప్ ను వెదికితే కనిపించడం లేదు. పేటీఎం, ఫోన్ పే తదితర యాప్‌లు వస్తున్నాయి కానీ గూగుల్ పే యాప్ ఆ స్టోర్‌లో రావడం లేదు. అయితే ఇది కేవలం తాత్కాలికమేనని గూగుల్ వెల్లడించింది.
గూగుల్ పే యాప్‌కు చెందిన కొత్త అప్‌డేట్ వల్ల సమస్య వచ్చిందని, అందుకనే యాప్‌ను తొలగించామని, సమస్యను ఫిక్స్ చేసి మళ్లీ యాప్‌ను స్టోర్‌లో ఉంచుతామని గూగుల్ తెలిపింది. అయితే గూగుల్ పే యాప్‌ను వాడుతున్న ఐఫోన్ యూజర్లకు పేమెంట్ ఫెయిల్యూర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కనుక వారు తాత్కాలికంగా పేమెంట్లను చెల్లించడం నిలిపివేయాలని గూగుల్ కోరింది. యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్‌లో ఉంచిన వెంటనే పేమెంట్లు చేసుకోవచ్చని, అప్పటి వరకు వేచి చూడాలని గూగుల్ తెలిపింది.
అయితే ఈ సమస్య కేవలం యాపిల్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ పే యాప్‌ను ఎలాంటి అసౌకర్యం లేకుండా వాడుకోవచ్చని గూగుల్ తెలియజేసింది.