మంగళగిరి ఎమ్మెల్యే మోసపోయారు..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాల బెడద రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో రైతులు ఘోరంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నకిలీ విత్తనాల బెడద ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఇప్పటి వరకు సాధారణ రైతులు నకిలీ విత్తనాలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కి కూడా నకిలీ విత్తనాల బెడద తప్పలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నకిలీ విత్తనాల ద్వారా మోసపోయాడు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏకంగా 14 ఎకరాల్లో పంట వేస్తే ఐదు ఎకరాల్లో నకిలీ విత్తనాలు వచ్చినట్లు గుర్తించారు. వేసిన పంట కొంచెం కూడా ఎదగకపోవడం తో నకిలీ విత్తనాలు వచ్చినట్లు గుర్తించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నకిలీ విత్తనాల ద్వారా మోసపోవడం తో రైతులందరూ మరింత భయాందోళనలో మునిగిపోతున్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version