జనవరి 1 నుంచి గూగుల్ పే కొత్త రూల్స్..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. క్యాష్ పేమెంట్స్ ని చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అయితే గూగుల్ పే ద్వారా పేమెంట్స్ ని ఎక్కువ మంది చేస్తున్నారు. మీరు కూడా గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి.

గూగుల్ పే కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. జనవరి 1 నుంచి గూగుల్ పే కొత్త రూల్స్ ని అమలు లోకి తీసుకు వస్తోంది. దీనితో గూగుల్ పే యూజర్లపై కూడా ప్రభావం పడే అవకాశముంది. 2022 జనవరి 1 నుంచి కార్డు నెంబర్లు, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలను గూగుల్ పే నిక్షిప్తం చేసుకోదు గమనించండి.

అంటే మీ కార్డు వివరాలను స్టోర్ చేసి ఉంచదు. గూగుల్ పే కూడా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నిబంధనలను ఫాలో అవ్వాలి. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్ల కోసం గూగుల్ పేలో కార్డు వివరాలను సేవ్ చేసుకున్న వారు ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోవాలి.

కార్డు జారీ సంస్థలు, కార్డు నెట్‌వర్క్ సంస్థలు మినహా వ్యాపారులు, ఇతర సంస్థలు కస్టమర్లు కార్డు వివరాలను స్టోర్ చేసుకోకూడదు అని ఆర్బీఐ రూల్స్ ప్రకారం తెలుస్తోంది. ఇదివరకు కస్టమర్ల కార్డు డేటా సేవ్ చేసుకొని ఉంటే వాటిని తొలగించాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version