బన్నీ కి సలాం కొట్టిన గూగుల్ తల్లి..!

-

అల్లు అర్జున్ పుష్ప టు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. కొంతమంది ఈ టీజర్ లో పెద్దగా ఏమీ లేదు అని అంటుంటే కొంతమంది మాత్రం ఇక ఇది చాలు సినిమా థియేటర్లకి పరుగులు పెట్టడానికి అని భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గూగుల్ సంస్థ స్పందించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది.

Pushpa2TheRuleTeaser

ఇంతకీ గూగుల్ ఏం చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా సాధారణంగా గూగుల్ సంస్థ చిన్న విషయాలకి పెద్దగా రియాక్ట్ అవ్వదు కానీ ఎందుకో తెలియదు పుష్ప టు టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా తగ్గేదేలే అనే పదాన్ని ఇంగ్లీషులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నట్లుగా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి దేర్ ఇస్ నో లేట్ ఇన్ డౌన్ అని ఒక ట్వీట్ని పోస్ట్ చేసింది దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఏకంగా గూగుల్ స్పందించింది టీజర్ గూగుల్ స్పందించే విధంగా ఉంది అని సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news