రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుండి గూగుల్ స్టేషన్ సేవలు క‌ట్‌..!

-

రైల్వే ప్రయాణికులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట భారత్ లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు గూగుల్ సంస్థ ‘గూగుల్ స్టేషన్’ పేరిట ఉచిత వైఫై తీసుకువచ్చింది. అయితే భారత్ లో ఇంటర్నెట్ ధరలు చాలా చవకగా ఉన్న నేపథ్యంలో ఉచితంగా వైఫై అందించడంలో అర్థంలేదని గూగుల్ భావిస్తోంది. అందుకే రైల్వే స్టేషన్ ల్లో ‘గూగుల్ స్టేషన్’ సేవలు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా వెల్ల‌డించారు.

కాగా.. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ప్రారంభించించగా.. ఇప్పటికి ఇది 5 సంవత్సరాలను పూర్తి చేసుకుందన్నారు. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు డేటా ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉంటున్నాయని, ముఖ్యంగా భారత్ లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో డేటా లభ్యమవుతోందని గూగుల్ వర్గాలంటున్నాయి. భారత్ లో సగటున ఓ యూజర్ నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. కనుకనే దేశవ్యాప్తంగా వున్న అన్ని రైల్వే స్టేషన్‌లలో ఇంటర్నెట్ సేవలను ఆపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version