ప్రశాంత్ కిశోర్ కి సంబంధించిన ఆ న్యూస్ తెలిసి .. “అబ్బో మనోడు పండగ చేసుకుంటున్నాడు కదా  ” అనుకున్న జగన్ !

-

దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు జెడియు పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు. జెడియు పార్టీ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల పార్టీ లో సరైన గౌరవం దక్కకపోవడంతో బయటకు వచ్చేశారు. కాగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయడానికి ప్రశాంత్ కిశోర్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రశాంత్ కిషోర్ కి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటం జాతీయ రాజకీయాల్లో హైలెట్ అయింది.

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయ సలహాలు ఇచ్చి ఢిల్లీలో మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించారు. ఇటువంటి తరుణంలో త్వరలో పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీకి రాజకీయ సలహాలు ఇవ్వడానికి ప్రశాంత్ కిశోర్ రెడీ అయ్యారు. ఇలాంటి సమయంలో ఎలాంటి రాజ్యాంగ పదవుల్ని కానీ.. అధికారిక పదవుల్ని కానీ చేపట్టని ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ఈ న్యూస్ విన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్  ‘అబ్బో మనోడు పండగ చేసుకుంటున్నాడు కదా ‘ అని అనుకుంటున్నారట. వైసీపీ ఏపీలో అధికారంలోకి రావటానికి గల కారణాలలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉందని జగన్ చాలాసార్లు చెప్పడం తో తాజాగా ప్రశాంత్ కిషోర్ కి జడ్ ప్లస్ భద్రత కేటాయించటం పట్ల జగన్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version