వర్క్ పాలసీని అప్ డేట్ చేసిన గూగుల్

-

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాల సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. అందుకు తగిన ఏర్పాటు సైతం చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయింది టెక్ దిగ్గజం, ప్రముఖ సర్చ్ ఇంజిన్ గూగుల్. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రకటించింది. ఇకపై ఉద్యోగులు తప్పసరిగా ఈ పాలసీని పాటించేలా కీలక ఎత్తుగడ వేసింది. ఉద్యోగుల పర్ఫార్మెన్స్ రీవ్యూలో ఆఫీస్ అటెండెన్స్‌ను చేర్చింది.

ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనను అంగీకరించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని గూగుల్ హెచ్చరించింది. ఈ నిబంధన పాటించని ఉద్యోగుల పనితీరుకు తక్కువ గ్రేడింగ్ ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు తన నూతన వర్క్ పాలసీని గూగుల్ ప్రకటించింది. హాజరు విషయంలో తాము రాజీపడబోమని గూగుల్ సీపీవో ఫియోనా సిక్కోనీ స్పష్టం చేశారు. ఆఫీసులకు దగ్గరగా నివసిస్తున్న ఉద్యోగులు ఈ నిబంధన తప్పక పాటించాలని సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version