యూజ‌ర్ల‌కు గూగుల్ వార్నింగ్‌.. ప్లే మ్యూజిక్ డేటాను డిలీట్ చేస్తారు..

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న ప్లే మ్యూజిక్ సేవ‌ల‌ను ఇప్ప‌టికే నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది అక్టోబర్‌లోనే ఈ సేవ‌ల‌ను నిలిపివేసింది. అయితే అందులో ఉన్న యూజ‌ర్ల డేటాను యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకునేందుకు గ‌తేడాది డిసెంబ‌ర్ వ‌ర‌కు టైం ఇచ్చారు.

కానీ ఆ గ‌డువును గూగుల్ ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. దీంతో కొత్త గ‌డువులోగా ప్లే మ్యూజిక్‌లో ఉన్న డేటాను యూజ‌ర్లు యూట్యూబ్ మ్యూజిక్ కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గడువు ముగిశాక డేటా ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది.

ఇక ప్లే మ్యూజిక్‌లో స‌బ్ స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు ఆటోమేటిగ్గా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవుతారు. అలాగే ప్లే మ్యూజిక్‌లో ఉండే యూజ‌ర్ల ప‌ర్చేజ్‌లు, ప్లే లిస్ట్‌లు, స్టేష‌న్స్‌, ఆల్బ‌మ్స్‌, సాంగ్స్‌ను కేవ‌లం ఒకే క్లిక్‌తో సుల‌భంగా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను ఆ యాప్‌లో ఉండే సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి ట్రాన్స్‌ఫ‌ర్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version