ఫేషియల్ హెయిర్ ని తొలగించడానికి ఈ చిట్కాలు పాటించండి…!

-

ఎంతో అందమైన ముఖం పై ఫేషియల్ హెయిర్ పెరగడం వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఫేషియల్ హెయిర్ అనేది హార్మోన్ల అసమతుల్యత కారణంగా పెరుగుతూ ఉంటాయి, ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. ఫేషియల్ హెయిర్ ను తొలగించడానికి సాధారణంగా త్రెడ్డింగ్, ప్లకింగ్ వంటివి బ్యూటీ పార్లర్ లో చేస్తారు. కానీ ఇదంతా తాత్కాలికంగానే పని చేస్తాయి, అంతే కాకుండా ఇలాంటివి చేయడం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి మరియు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. కానీ కొన్ని సహజ నివారణలు తో ఫేషియల్ హెయిర్ ను తగ్గించుకోవచ్చు, అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

పసుపు:

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫేషియల్ హెయిర్ ను తొలగించడమే కాకవాటి పెరుగుదలను కూడా అదుపులోనే ఉంచుతుంది. పసుపును శనగపిండి తో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఫేషియల్ హెయిర్ తొలగిపోవడమే కాకుండా ముఖం మరింత అందంగా మారుతుంది.

బొప్పాయి :

బొప్పాయి గుజ్జులో చిటికెడు పసుపు కలిపి ఫేషియల్ హెయిర్ మీద అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ పోతుంది.

ఇలాంటి చిట్కాలు తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమే. ఈస్ట్రోజన్ లు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది. అవిస గింజలు, సోంపు, సోయాబీన్స్ ,డ్రైఫ్రూట్స్, వెల్లుల్లి వంటి వాటిలో ఈస్ట్రోజన్స్ అధికంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version