రాజమండ్రి : పార్టీ మార్పుపై టి.డి.పి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా ఆయన మీడియా తో మాట్లాడుతూ టిడిపి పార్టీలో లోటుపాట్లను చంద్రబాబుకు రాతపూర్వకంగా ఇచ్చానని.. ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలని సూచించానని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని.. జగన్ ప్రభుత్వం పెన్షన్ లబ్దిదార్లకు చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు.
లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాలు పింఛన్లు తొలగిస్తున్నారని.. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే పోలవరం అంచనాలు 55 వేల కోట్లకు కేంద్రం అంగీకరించ లేదని ఫైర్ అయ్యారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోలవరం నిర్వాసితుల ఇళ్లకు 25 రకాల సౌకర్యాలు కల్పిస్తామనీ రెండు సౌకర్యాలు కూడా ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో 9 వేల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాల పై తప్పుడు కేసుల విధానం మానకపోతే డి.జి.పి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.