తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, కవితలతో జనంలో చైతన్యాన్ని నింపిన వారిలో సింగర్, రైటర్ గోరటి వెంకన్న ఒకరు. అందుకే ఆయన త్యాగాన్ని, పోరాట ప్రతిమను గుర్తించి గత బీఆర్ఎస్ సర్కార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
తాజాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో గోరటి వెంకన్న మాట్లాడారు. అంతకుముందు తన పద్యాలలు, కవితలు, చమత్కారాలతో ప్రభుత్వం పై రెచ్చిపోయారు. ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగించాలని హితవు పలికారు. సభలో తెలంగాణ గొప్పతనాన్ని అభివర్ణించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి తన దైన స్టైల్లో సలహాలు, సూచనలు చేశారు.
తన పద్యాలతో ..తన కవితలతో..తన చమత్కారాలతో
ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగించండి అని హితవు పలుకుతూ
సభలో తెలంగాణ గొప్పతనాన్ని అభివర్ణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఫుల్ వీడియో!
నేటి తరం యువకులు చూడాల్సిన వీడియో pic.twitter.com/gvuFxtrEoI
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) March 22, 2025