ఇప్పటి కంటే గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులు ఎక్కువ !

-

ఇప్పటి కంటే గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులు ఎక్కువ జరిగాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 దేవాలయాలపై దాడి జరిగిన కేసులు నమోదు కాగా, వాటిలో 12 మంది నిందుతలును అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. జరిగిన దాడులన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జరిగినవేనాన్న ఆయన గత ఐదేళ్లతో పోలిస్తే 2020లో దేవాలయాలపై జరిగిన దాడులు చాలా తక్కువని ఆయన అన్నారు.

2015వ సంవత్సరంలో 290 కేసులు, 2016 లో 322, 2017లో 318, 2018లో 267, 2019 లో 305, 2020లో 228 కేసులు నమోదయ్యాయని డీజీపీ పేర్కొన్నారు. అంతర్వేది ఘటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్న ఆయన రాష్ట్రవ్యాప్తంగా 47వేల 593 ప్రార్ధనా మందిరాలు ఉన్నాయని గుర్తించామని అన్నారు. వాటిలో 28,567 దేవాలయాలు ఉన్నాయని అయితే వీటిలో 10 శాతం దేవాలయాలలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయన్న ఆయన మిగిలిన అన్ని దేవాలయ నిర్వహకులకు సీసీ కెమెరాలు అమర్చాలని నోటీసులు జారీ చేశామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version