అన్ని కోట్లు విలువచేసే భూమి ఆక్రమణకు గురవుతుందా..?

-

నగరంలో ప్రతిరోజూ ఏదో ఓ చోట ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతూనే ఉంది. అధికారులు వచ్చి స్వాధీనం చేసుకుని హెచ్చరించినా.. ఆక్రమణదారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదంటున్నారు నగరవాసులు. భాగ్యనగరంలో బల్దియాకు సంబంధించిన భూమి ఎక్కడెక్కడా ఎంతుందో..? అస్సలు ఉందా లేదా అనే స్పష్టమైన ఆధారాలు లేవని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల ధనిక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో దాదాపుగా రూ.700 కోట్ల విలువచేసే భూమి కబ్జా కోరల్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతభాగం ఆక్రమణకు గురికాగా, మిగిలింది హోంఫట్‌ చేసేందుకు మరికొందరు కన్నెసినట్లు తెలిసింది.

బల్దియాకు తెలుసా..

ఇదంతా బల్దియాకు తెలుసా..? లేక తెలిసి కూడా మౌనం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బల్దియాలకు దాదాపుగా 5 వేలకు పైగా కాలనీల్లో మినీ ప్రార్కులు కమ్యూనిటీ హాళ్లు ఇతరాత్ర అవసరాల కోసం 1-15 ఎకరాల ఉన్న స్థలాల విలువ దాదాపుగా రూ.10 వేల కోట్లు ఉండొచ్చనే అంచనా. ఈ వివరాలపై ఆరు నెలల క్రితం విజిలెన్స్‌ అధికారులు ఆరా తీయగా, చాలా కాలనీల్లోని భూములకు సంబంధించి రికార్డులు లేనట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.51లో బల్దియా పేరున ఉన్న 10 ఎకరాల భూమిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు సగం ఎకరాన్ని ఆక్రమించగా మరో సగాన్ని పత్రాలు తయారుచేసి అమ్మేశారు కూడా. మిగిలిన భూ భాగాన్ని చదును చేసి అమ్మకానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానికులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేస్తే సంబం«ధిత తహసీల్దార్‌ సిబ్బందితో వచ్చి సర్వే చేయించగా, ఆ భూమి బల్దియాకు చెందినట్లు రికార్డులో ఉంది. ఉన్నతా«ధికారులు స్పందించి కట్టడి చేయకపోతే ఆ ప్రభుత్వ భూమి ఆకాశాన్ని తాకేలా భవనాలు వెలిసి ఎంతో విలువైన భూమి కబ్జాకోరల్లో వెళ్లే ప్రమాదముందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version