వొడాఫోన్ ఐడియాలో వాటాదారుగా ప్ర‌భుత్వం

-

టెలికం దిగ్గ‌జ కంపెనీ వొడాఫోన్ ఐడియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఆర్థిక భారంతో ఇబ్బంది ప‌డుతున్న వొడాఫోన్ ఐడియా త‌న కంపెనీలోని 35.8 శాతం వాటాను ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వొడాఫోన్ ఐడియా కు ఉన్న రూ. 16,000 కోట్ల వ‌డ్డీ బ‌కాయిల‌ను ఈక్విటీగా మార్చేందుకు అంగీక‌రించింది. దీంతో ప్ర‌భుత్వానికి వొడాఫోన్ ఐడియాలో దాదాపు 35.8 శాతం వాటా ల‌భించ‌నుంది. అయితే భార‌త్ లోనే మూడో అతిపెద్ద టెలికం కంపెనీ గా ఉన్న వొడాఫోన్ ఐడియా ప్ర‌స్తుతం అప్పుల భారంతో స‌త‌మ‌తం అవుతుంది.

టెలికం రంగంలోకి జియో వ‌చ్చిన నాటి నుంచి దాదాపు చాలా టెలికం కంపెనీలు మూసుకున్నాయి. అప్పుడు వొడాఫోన్ ఐడియా కు కూడా గ‌డ్డు ప‌రిస్థితులు వ‌చ్చాయి. అయితే వొడాఫోన్ ఐడియా కు ఉన్న స్పెక్ట్ర‌మ్ పై వ‌డ్డీ, ఏజీఆర్ బ‌కాయిలు చాలా రోజుల నుంచి చెల్లించ‌డం లేదు. దీంతో బ‌కాయిలు చెల్లింపు బ‌దులు వాటా ఇవ్వ‌డం ఉత్త‌మం అని వొడాఫోన్ ఐడియా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ప్ర‌భుత్వానికి 35.8 వాటా ఇవ్వ‌నుంది. దీంతో వొడాఫోన్ గ్రూప్ వాట 28.5 కి ప‌డిపోనుంది. అలాగే ఐడియా సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ వాట 17.8 కు ప‌డిపోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version