టెక్స్టైల్, గార్మెంట్ ఇండస్ట్రీకి కేంద్రం శుభవార్త అందించింది. కాటన్ దిగుమతులపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు టాక్స్ ను తొలగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడవును మరో కొన్ని రోజుల పాటు కేంద్రం పొడిగించింది. 11 శాతం కస్టమ్స్ డ్యూటీని డిసెంబర్ 31 వరకు మినహాయిస్తూ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. US టారిఫ్స్ తో వచ్చే నష్టాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరలను తీసుకువచ్చింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. బతుకమ్మ చీరల కారణంగా చాలామంది నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. ఉపాధితో పాటు డబ్బులను సంపాదిస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగితను తరిమి కొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.