పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. రేవతి తో పాటు ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాదాపు 8 నెలల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో శ్రీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కుటుంబాన్ని అన్ని విధాల అల్లు అర్జున్ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుంది.

అయితే ఈ సంధ్యా థియేటర్ లో గాయపడ్డ బాలుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సహాయం చేసింది. బాలుడి చెల్లెలికి 18 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు 4000 రూపాయలు అందించేలా నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చైల్డ్ రైట్స్ కమిషన్ చొరవతో మిషన్ వాత్సల్య పథకం… వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.