యూరియా కొరతపై మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

-

యూరియా కొరతపై మంత్రి తుమ్మల బహిరంగ లేఖ రాసారు. తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లేఖలో తుమ్మల ఆరోపణలు చేసారు.

thummala

ఇక అటు యూరియాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేనందుకు నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇష్యూ చేసింది. బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేసింది. తద్వారా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం లభించనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news