హరీశ్ రావుపై స్పీకర్‌కు ప్రభుత్వ విప్ ఫిర్యాదు..

-

అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు పలు వాయిదా తీర్మానాలు కోరడంతో స్పీకర్ అందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే ప్రశ్నత్తోరాలను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, స్పీకర్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు మీద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.

సభలో నిబంధనలకు విరుద్ధంగా హరీశ్ రావు ఫొటోలు తీశారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సభను తప్పుతోవ పట్టించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ విప్‌కు బదులిచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news