కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిలో వాటాను కోల్పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం కృష్ణా నదిలో 1,020 టీఎంసీల నీళ్లు వచ్చాయి. 66:34 ప్రతిపాదనల ప్రకారం తెలంగాణకు 346 టీఎంసీలు రావాలి. ఈ ప్రభుత్వం కేవలం 266 టీఎంసీలనే వాడింది.
తెలంగాణకు 34 శాతం కేటాయింపులుంటే.. ఇప్పటి వరకు 27% నీటినే వాడుకున్నాం.ఈ ఫెయిల్యూర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ వాటర్ వివాదాలపై సరిగా స్పందించడం లేదని విమర్శలు చేశారు.