ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.
3 వారాల క్రితం గవర్నర్ వద్దకు బిల్లులను ప్రభుత్వం పంపింది.గవర్నర్ ఆమోదంతో శాసన ప్రక్రియ పూర్తయిందన్న ప్రభుత్వ వర్గాలు.బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన గవర్నర్.జూన్ 16న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపారు.ఈ బిల్లులపై మండలిలో ఎలాంటి చర్చ జరగకుండానే నిరవధిక వాయిదా.రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు.