పరీక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ తమిళిసై

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై “ఇంతకు ముందు విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి అంటే ఎలా చదవాలి అని అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని అన్నారు”. మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గవర్నర్ తమిళ సై. ఈ సందర్భంగా పద్మభూషణ్ గ్రహీత, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కృష్ణస్వామి కస్తూరీరంగాకి డాక్టరేట్ ప్రధానం చేయడంతో పాటు వివిధ భాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించడం జరిగింది. యూజీ, పీజీ, పీహెచ్.డీ భాగాలలో కలిపి మొత్తం 92,005 వేల మందికి డిగ్రీలను అందించారు.

ఈ నేపథ్యంలో, గవర్నర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అన్నారు ఆమె. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదు అని తెలిపారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని తెలిపారు గవర్నర్. మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని విద్యార్థులతో మాట్లాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version