ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చిందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏవో కుట్రలు ఉన్నాయని చెబుతున్నారన్న సీఎం.. ఎంతవరకు కరెక్టో తెలియదని చెప్పారు. ఇతర దేశాల వాళ్ళు కావాలనే మనదేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని అన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలేనని తెలిపారు. కాకపోతే ఎప్పటికంటే ఇపుడు కొంచెం ఎక్కువగా వరదలు వచ్చాయి అని అన్నారు గవర్నర్ తమిళిసై. మరోవైపు క్లౌడ్ బరస్ట్ పై అంతర్జాతీయ కుట్ర సమాచారం ఉంటే ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ దేశాలు, ఏ సంస్థలు కుట్రలు చేశాయో సీఎం కేసీఆర్ తెలిపితే విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.