ఉత్తరప్రదేశ్‌లోని బహదూర్‌పురాకు చెందిన ఓ వృద్ధుడు తన ఇద్దరు మనవళ్లకు ఆంగ్ల పాఠాలు చెబుతుండడం.. అది కూడా షాకింగ్ అనిపించేలా పదాలను నేర్పిస్తుండడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ ఫర్ ఆపిల్.. బి ఫర్ బాయ్.. సి ఫర్ క్యాట్.. ఇవీ.. చిన్న పిల్లలకు మన నేర్పించే పదాలు.. ఈ పదాలతోనే వారు ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెడతారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఓ తాత మాత్రం తన మనవళ్లకు వింతైన పద్ధతిలో ఆంగ్ల పదాలను నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను తన మనవళ్లకు నేర్పిస్తున్న ఆ పాఠాల తాలూకు వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బహదూర్‌పురాకు చెందిన ఓ వృద్ధుడు తన ఇద్దరు మనవళ్లకు ఆంగ్ల పాఠాలు చెబుతుండడం.. అది కూడా షాకింగ్ అనిపించేలా పదాలను నేర్పిస్తుండడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3, 4 సంవత్సరాల వయస్సున్న తన ఇద్దరు మనవళ్లకు ఆ వృద్ధుడు.. ఎ ఫర్ ఆపిల్ కు బదులుగా ఆల్కహాల్.. అని.. బి ఫర్ బీడీ.. అని నేర్పిస్తున్నాడు. దీంతోపాటు వాటిని ఎలా సేవించాలో కూడా నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అలా నేర్పిస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో కాస్తా అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
కాగా ఈ ఘటనపై స్థానిక అట్రౌలీ పోలీస్ స్టేషన్ పోలీసులు స్పందించారు. సదరు వృద్ధుడిపై వారు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తున్నట్లు అలీగడ్ పోలీస్ సీనియర్ ఎస్పీ వెల్లడించారు. కాగా ఈ వీడియోను చూసిన చాలా మంది ఆ వృద్ధున్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన మనవళ్లకు మంచి మాటలు నేర్పించాల్సింది పోయి.. వారికి ఇలా చిన్నతనంలోనే చెడు అలవాట్లను నేర్పించడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవున్లెండి.. అందుకే అన్నారు పుర్రకో బుద్ధి అని.. ఇలాంటి వారు మన సమాజంలో ఉన్నంత కాలం సమాజంలో మార్పు రావాలని ఆశించడం మన ఖర్మే అవుతుంది తప్ప మరొకటి కాదు..!