న్యూజిలాండ్‌దే వరల్డ్ కప్, ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన జ్యోతిష్యుడు

-

ఆయన పేరే బాలాజీ హాసన్. ఆయనది తమిళనాడు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఇండియా సెమీస్‌లో ఇంటి దారి పడుతుందని.. ఈసారి కప్‌ను న్యూజిలాండ్ ఎగరేసుకుపోతుందని ఓ జ్యోతిష్యుడు ముందే ఊహించాడు. ఇప్పుడు కాదు.. ఆరు నెలల ముందే అంటే జనవరిలోనే ఆ జ్యోతిష్యుడు భారత్ ఓడిపోతుందని చెప్పాడు. అంతే కాదు.. సెమీస్‌లోకి భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వెళ్తాయని.. వాటిలో భారత్‌తో న్యూజిలాండ్ ఆడుతుందని.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతుందని కూడా ఆయన చెప్పడం విశేషం.

ఆయన పేరే బాలాజీ హాసన్. ఆయనది తమిళనాడు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను హీరో మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? 2019 ప్రపంచకప్‌లో ఏ జట్టు గెలుస్తుందని యాంకర్ ప్రశ్నించడంతో.. ఇది చాలా కష్టమైన ప్రశ్న అని అన్న బాలాజీ హాసన్.. ఇప్పటి వరకు గెలవని జట్టే ఈసారి వరల్డ్ కప్ సాధిస్తుందని చెప్పాడు. ఈసారి టైటిల్‌ను న్యూజిలాండ్ గెలుస్తుందని.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కేన్ విలియమ్సన్‌ను వరిస్తుందన్నాడు. ఆయన చెప్పినట్టుగానే అన్ని జరుగుతుండటంతో ఆ వీడియోకు ప్రస్తుతం ప్రాముఖ్యత పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version