ఇంగ్లీష్… ప్రపంచాన్ని జయించాలి అంటే కచ్చితంగా కావాల్సిన భాష. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే ఇంగ్లీష్ లేకుండా పని జరగదు అనేది అందరికి తెలిసిందే. అందుకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవిష్యత్తు తరాల కోసం ఇంగ్లీష్ ని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మనకంటే ముందు తరాలకు ఇంగ్లీష్ బాష వచ్చినా సరే సరైన అవకాశాలు లేక చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు.
తాజాగా ఒక బామ్మ మాట్లాడిన ఇంగ్లీష్ చూస్తే మాత్రం మనం ఫిదా అయిపోతాం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక బామ్మ ప్రస్తుతం ఓడిస్సాలో నివసిస్తుంది. ఆమె మహాత్మా గాంధీ గురించి ఇంగ్లీష్ లో చెప్తుండగా అక్కడ ఉన్న ఒకరు వీడియో తీసారు. మహాత్మా గాంధీ హిందూ, ముస్లింలను సమానంగా ప్రేమించేవారనీ… ఆయన సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారనీ… చాలా సాదాసీదాగా ఉండేవారనీ…
ఎక్కువగా మేక పాలు తాగేవారనీ… ఆయన మన దేశానికి జాతిపిత అనీ. మహాత్మాగాంధీ అహింసను ఇష్టపడేవారని ఆమె చెప్పింది. ఈ వీడియో ని భువనేశ్వర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్ బొత్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. మీరు ఈమె ఇంగ్లీష్‌కు ఎన్ని మార్కులు ఇస్తారు..? అని ప్రశ్నించగా ఆమెకు నెటిజన్లు పదికి పది మార్కులు వేసి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
How many marks out of 10 for the old lady for this spoken English Test? pic.twitter.com/QmPSEd4o0L
— Arun Bothra (@arunbothra) March 1, 2020