మహిళల వన్ డే ఫార్మాట్ లో నంబర్ వన్ ప్లేయర్ గా తాజాగా శ్రీలంక కు చెందిన చమరి అటపట్టు నిలిచింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక మహిళగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్ డే టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ ఉంది. మూడు వన్ డే ల సిరీస్ లో రెండు మ్యాచ్ లను గెలుచుకోవడంతో సిరీస్ ను సైతం చేజిక్కించుకుంది. ఈ సిరీస్ లో చమరి ఆటపట్టు వరుసగా రెండు సెంచరీ లు చేయడంతో ఒక్కసారిగా ఐసీసీ వన్ డే ఐసీసీ ర్యాంకింగ్ లో మొదటి స్థానానికి చేరుకుంది. కాగా ఇండియా నుండి హర్మన్ ప్రీత్ కౌర్ 6 వ స్థానంలో, స్మృతి మందన్న ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్ లో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ మొదటి స్థానంలో ఉంది.
గ్రేట్ ఇంప్రూవ్మెంట్: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ గా చమరి ఆటపట్టు …
-