ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీగా సాగుతున్న వార్ మరిన్ని మలుపులు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా గతంలో ముద్రగడ, మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు కాపు నేత హరిరామజోగయ్య ఘాటు కౌంటర్లు ఇచ్చారు. దీంతో గుడివాడ కూడా ఆయనకు ఉత్తరాలు రాస్తూ తిరిగి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా పవన్ ను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇవాళ హరిరామజోగయ్య చేసిన విమర్శలతో మళ్లీ గుడివాడ లైన్లోకి వచ్చారు.
వయసు పెరిగే కొద్దీ మీలో అశ్లీలత పెరుగుతోంది అని విమర్శించారు. ఎవరికైనా వయసు పైబడే కొద్దీ సభ్యత సంస్కారం పెరుగుతుంటాయి… కానీ పవన్ తో సాంగత్యం వల్ల మీకు అశ్లీలత ఎక్కువ అవుతోందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీ పడాలని మీరు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ పై మీకున్నది ధృతరాష్ట్ర ప్రేమ… దాని వల్ల ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించారు. పవన్ తో సినిమాలు తీసే నిర్మాతలంతా చంద్రబాబు మనుషులే, అసలు, పవన్ కల్యాణ్ పుట్టిందే చంద్రబాబు కోసం, పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో అని అమర్నాథ్ పేర్కొన్నారు.