బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

-

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పుణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్స్ లు, 17 ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్మిత్ 63, వార్నర్ 53 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరుకుంది.

నవంబర్ 16న సెమిస్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది ఆసీస్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అత్యధికంగా హృదోయ్ 74 పరుగులు చేశాడు. ఓపెనర్లు తంజీద్ హసన్ 36, లిటన్ దాస్ 36, శాంతో 45, మహ్మదుల్లా 32, ముష్పికర్ రహీం 21, మెహిదీ హసన్ మిరాజ్ 29 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అబాట్, జంపా తలో రెండు వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news