గ్రేటర్ లో కేసీఆర్ మాస్టర్ పంచ్..డిఫెన్స్ లో పడ్డ విపక్షాలు…!

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్ ని మట్టికరిపించేందుకు ప్యూహలతో సిద్దమవుతున్నాయి కాంగ్రెస్,బీజేపీ. కానీ సీఎం కేసీఆర్ లాస్ట్ మినిట్స్ లో ఇచ్చిన రిజర్వేషన్ పంచ్ విపక్షాలకు శరాఘాతంలా మారింది…

చట్ట ప్రకారం GHMCలో 33 సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలి. కానీ 2016లో జరిగిన GHMC ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లు మహిళలకు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ 50 శాతం సీట్లకు చట్టబద్దత కల్పించడం ద్వారా కాంగ్రెస్‌, బీజేపీలను ఇరకాటంలో పడేస్తున్నారు.అంటే 150 డివిజన్లు ఉన్న GHMCలో 75 డివిజన్లు మహిళలకే దక్కుతాయి.

ప్రస్తుతం GHMC కౌన్సిల్‌లో TRSకు 79 మంది.. MIMకు 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆలోచన తెలిసిన అధికార పార్టీ డివిజన్లలో బలమైన మహిళా నేతలను సిద్ధం చేసిందట. ఇప్పుడున్నవారిపై వ్యతిరేకత ఉంటే.. ఆమేరకు మరో శక్తిమంతమైన మహిళా నేతకు టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మరి.. బీజేపీ, కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి? దాదాపు 75 మంది బలమైన మహిళా నేతలను ఎంపిక చేసుకోగలవా? అధికార పార్టీని ఢీకొట్టేంత ఆర్థిక, అంగబలం కలిగిన మహిళలు విపక్ష పార్టీలకు ఈ తక్కువ సమయంలో లభిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. ఈ వ్యూహం తెలిసినప్పటి నుంచీ తమ దగ్గరా బలమైన మహిళా అభ్యర్థులు ఉన్నారని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పైకి ప్రకటనలు చేస్తున్నా.. ప్రైవేట్‌ సంభాషణల్లో మాత్రం వారి మాటలు మరోలా ఉన్నాయట. నాటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తామన్న పార్టీలన్నీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. 99 సీట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడగా బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3,టీడీపీ నుంచి ఒక కార్పొరేటర్‌ గెలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version