గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు రావడంతో ప్రభుత్వ పెద్దలతో పాటుగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన బల్దియా అధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించారు కమిషనర్ లోకేష్ కుమార్.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని లోకేష్ కుమార్ స్పష్టం చేసారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని లోకేష్ కుమార్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసారు.