గినియాలో ఘోరం..ఫుట్ మ్యాచులో కొట్లాట.. 100 మంది మృతి?

-

ఆఫ్రియా ఖండంలోని గినియా దేశం ఘోర విషాదం చోటుచేసుకుంది. జెరెకొరె నగరంలో నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఘర్షణలు తలెత్తాయి.ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 100 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పద కావడంతో ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు.

దీంతో అవతలి జట్టు వారు వారిని అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో ఘర్షణ జరిగింది. ఇరు జట్ల అభిమానులు దారుణంగా కొట్లాటకు దిగారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలిసింది. వేలాది మంది వీధుల్లో దాడులు చేసుకోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news