తెలంగాణలో ఈ నెల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లతో జీఎస్టీ ఆల్ టైమ్ హై గా నిలిచింది. జులై 1 2017 మొదలు అంటే జీఎస్టీని తీసుకొచ్చిన నెల నుండి ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారని ఆర్థిక శాఖ ప్రకటించింది. నిజానికి దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరగ్గా తెలంగాణలో మాత్రం తగ్గాయి.
గతేడాది నవంబరుతో పోలిస్తే రాష్ట్రంలో వసూళ్లు పడి పోయాయి కూడా. అయితే ఈ నెల మాత్రం కొత్త రికార్డులు సృష్టించాయి ఈ జీఎస్టీ వసూళ్లు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ శర వేగంగా కోలుకోవడం, జీఎస్టీ ఎగవేతదారులపై కఠిన చర్యల తీసుకోవడం వలనే ఈ మేర వసూళ్లు సాధ్యమైనట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. అయితే ఒకే నెలలో జీఎస్టీ రూ.లక్ష కోట్లు దాటడం ఇది మూడోసారి.