బహు భార్యలతో విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. ఈ మాటలు నేను చెప్పింది కాదు.. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ చెప్పిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలు చేశారు. దత్త పుత్రుడు రైతులను మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. ప్రతీ కౌలు రైతుకు పరిహారం సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారన్నారు గుడివాడ అమర్‌నాథ్.
లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలు వున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని… నలుగురు పెళ్లాల ముద్దుల మొగుడు పవన్ కల్యాణ్ అని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నాడని గుడివాడ అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని వెల్లడించారు గుడివాడ అమర్‌నాథ్. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. ఆనాడు చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు గుడివాడ అమర్‌నాథ్.