పవన్ కళ్యాణ్ కు ఏదైనా 3 ఉండాలి.. మూడు పార్టీలు, మూడు ఆప్షన్లు – మంత్రి గుడివాడ

-

పవన్ కళ్యాణ్ కు ఏదైనా 3 ఉండాలి.. మూడు పార్టీలు, మూడు ఆప్షన్లు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు అంటించారు. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరని.. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడు.. చంద్రబాబుకు సిగ్గుందా.. చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోందన్నారు. కట్టె కాలిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది?? తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాడు.. తన కంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఇంత అద్భుతంగా చేస్తుంటే చంద్రబాబు చూడలేక పోతున్నాడన్నారు.

నలుగురు సహాయంగా వస్తే తప్పించి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. జగన్ ను తిట్టేస్తే ఇవాళ ప్రశాంతంగా పొడుకోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబుదని వెల్లడించారు. విశాఖను రాజధానిగా చంద్రబాబు అంగీకరిస్తున్నాడో లేదో చెప్పాలి.. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు విశాఖకు ఏం చేశాడని నిలదీశారు. కుప్పంలో ప్రజలు ఎందుకు తిరగబడ్డారు చంద్రబాబు చెప్పాలి.. రాజకీయాల్లో ఎవరు బచ్చానో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. జనసేనను రాజకీయ పార్టీగానే పరిగణించటం లేదన్నారు గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version