ప్లాస్టిక్ తీసుకు రండి.. ఫుల్లుగా తినేసి వెళ్ళండి..!

-

ప్లాస్టిక్ వల్ల మానవాళికే కాదు..పర్యావరణానికి కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది.ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల మరింత ప్రమాదం ఉంది.బయట ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ చెత్తా చెదారం దర్శనిమిస్తుండటంతో, గుజరాత్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను జూలై 1 నుంచి నిషెధించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు గుజరాత్లోని జునాగఢ్ ప్రాంతంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఓ కేఫ్ను ప్రారంభించింది. ఇక్కడ డబ్బులకు బదులు ఒక్కసారి వాడిపారేసిన చెత్త ఇస్తే ఫుడ్ సరఫరా చేస్తారు. ఇక ఈ కేఫ్లోని ఫుడ్ తయారీలో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఓ ఏజెన్సీ కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు..

గత నెల 30 న ఈ కెఫ్ ను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచురల్ ప్లాస్టిక్ కేఫ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేఫ్లో ప్రజలకు సహజసిద్దంగా వండిన ఆహారం లభిస్తుందన్నారు. ఒక్కసారి వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి..అందుకు సరిపడా ఫుడ్ను తినొచ్చని ఆయన చెప్పారు.రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితం చెయ్యాలనే ఉద్దేశ్యం తో కేఫ్ ను ప్రారంభించినట్లు తెలిపారు.ఇలా చేయడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుందని అభిప్రాయ పడ్డారు..ప్లాస్టిక్ కేఫ్లో 500 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలకు గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో ప్లాస్టిక్కు ఒక పోహ అందిస్తారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటే… పెద్ద గిన్నెలో ఇతర ఆహార పదార్థాలను వడ్డిస్తారు. ఇక ఈ కేఫ్లో తమలపాకు, గులాబీ, అంజీర్ , బెల్లంతో తయారు చేసిన వంటకాలు ప్రత్యేకం. అంతేకాదు గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయ..అన్నీ వంటలను మట్టి పాత్రలలో వడ్డిస్తారు. కేవలం రెండు రోజుల్లోనే మంచి స్పందన లభించింది.. త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version