పాకిస్తాన్ నుంచి భారత్ కి మరో ప్రమాదం, భయపడిపోతున్న రైతులు…!

-

పాకిస్తాన్ నుంచి ఇన్నాళ్ళు ఉగ్రవాదులతో ఇబ్బంది పడిన భారతదేశానికి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఆఫ్రికాలోని సూడాన్‌, ఎరిట్రియా దేశాల నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ ద్వారా పాకిస్థాన్‌ లోకి వచ్చిన మిడతల దండు ఇప్పుడు గుజరాత్ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గుజరాత్ లో నైరుతి రుతుపవనాలు ఎక్కువ కాలం ఉన్న నేపధ్యంలో భారీగా వచ్చిన మిడతల దండు అక్కడే తిష్ట వేసింది. మెహసాణా, కచ్‌, బనాస్‌కాంఠా, పాఠన్‌, సాబర్‌కాంఠా జిల్లాల్లో, రాజస్థాన్ లోని కొన్ని జిల్లాల్లో మిడతల దండు రైతులకు చుక్కలు చూపిస్తుంది.

గోధుమ, పత్తి, ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంప, జట్రోఫా వంటి పంటల మీద పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వేల హెక్టార్లలో పంటను ఈ మిడతల దండు నాశనం చేస్తుంది. పాకిస్తాన్ లోని సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం మీదుగా మన దేశంలోకి చొరబడిన మిడతల దండు గుజరాత్ అధికారులకు, రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపాని, బనాస్‌కాంఠా జిల్లాలో 1815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను కొట్టి౦చామని, త్వరలోనే వాటిని నిర్మూలిస్తామని చెప్పారు.

వీటి వలన నష్టపోయిన రైతులకు పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పడం గమనార్హం. వీటి గురించి ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) హెచ్చరించినా గుజరాత్ అధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోలేదు. దీనితో వేల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు రైతులు. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. 11 కేంద్ర ప్రభుత్వ బృందాలను గుజారత్ లోని ప్రభావిత ప్రాంతాలకు పంపింది. అక్కడి ప్రజలు కూడా వాటిని పంపించడానికి రైతులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version