గులాబ్ తుఫాన్: ప్రభావితం కానున్న ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

-

భారతీయ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంటు వారు తెలిపిన దాని ప్రకారం ఆదివారం సాయంత్రం వరకు ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాల్లో గులాబ్ తుఫాను పెను భీభత్సం సృష్టించనుంది. దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ఈ మేరకు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండనుందని అర్థం అవుతుంది. మరో 12గంటల్లో ఒరిస్సా లోని గోపాల్ పూర్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ప్రాంతాల్లో తుఫాను భీభత్సం ఉండనుందని మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ సూచించింది.

వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయంటూ, అందువల్ల ప్రయాణాలు మానుకోవాలని, ప్రస్తుతానికి రవాణా సంస్థలు తమ వాహనాలకు నిలిపివేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఒరిస్సాలో 24రైళ్ళను రద్దు చేసారు. ఆరెంజ్ అలర్ట్ కారణంగా కరెంట్ కోత ఉండనుందని హెచ్చరించారు. ఇంకా, దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇండియన్ మెటోలాజికల్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version