బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తుపాకీ లైసెన్స్ కోరుతూ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న ముంబయి పోలీసులు తాజాగా గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు.
కాగా, సల్మాన్‌ను, ఆయన తండ్రిని చంపుతామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో తుపాకీ లైసెన్స్ కోరుతూ నటుడు ముంబయి పోలీసు హెడ్‌క్వార్టర్‌లో కమిషనర్ వివేక్ ఫాన్సాల్కర్‌ను కలిసి ఇటీవలే దరఖాస్తు చేశారు.
కొద్ది రోజుల క్రితం పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా గతే మీకూ పడుతుందంటూ.. సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌లకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపింది. రోజూ జాగింగ్ అయ్యాక సల్మాన్ కూర్చునే బెంచిపై ఈ లేఖ లభించినట్లు అప్పుడు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది’ అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు తీవ్రంగా పరిగణించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు బంద్రాలోని గెలాక్సీ అపార్టుమెంటులో ఉంటున్న సల్మాన్‌ఖాన్ నివాసానికి వెళ్లి సలీం వాంగ్మూలం సేకరించారు. వారి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, ఈ బెదిరింపులను పబ్లిసిటీ స్టంట్‌గా అనుమానించారు.