పోలీసులతో దోస్తానా…! ప్రభుత్వ వాహనం..! 60 కేసులు..! గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే…!

-

ఇతను క్రూరత్వానికి నిదర్శనం ఈయన గ్యాంగ్ క్రూరత్వానికి పరాకాష్ట…! మానవత్వం అస్సలే లేదు ఇప్పటికే ఎన్నో నేరాలు వాటిలో పోలిసులకు కేవలం 60 మాత్రమే తెలుసు ఆ 60 నేరాలకు గాను ఈయన పై కేసులు ఉన్నాయి. పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయి. తాను ఉంటున్న ఏరియా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో ఉన్నవాళ్ళు అంతా ఇతనికి సన్నిహితులే. దాదాపుగా 24 మంది పోలీసులతో ఈయనకు సంబంధాలు ఉన్నాయి. ఓ నేరస్తుల ముఠాను కూడా నడుపుతున్నాడు. క్రైమ్ రికార్డ్ పెరగడంతో ఓ డీఎస్పీ ఈయన గ్యాంగ్ పై అటాక్ చేసేందుకు బయలుదేరగా ఈయన పోలీస్ మిత్రులు ఈయనకు ముందుగానే సమాచారం అందించారు దాంతో అటాక్ చేయడానికి వచ్చిన పోలీసులపై వీరే ముందు అటాక్ చేశారు. దాదాపుగా 200 నుండి 300 బులెట్లు పేల్చారు దాంతో డీఎస్పీ ఎస్సై సహా 8 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించారు. ఈయనే ఓ కరుడు గట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే…!

gangster vikas dubey story

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన షూట్ ఔట్ లో ఈయనే ప్రధాన నిందితుడు. 2014 లో గవర్నర్ హౌజ్ లో వేలం వేస్తుండగా తన సోదరుడితో ఓ అంబాసిడర్ కారును కొనుగోలు చేయించాడు. ఎవ్వరికీ డౌట్ రావోద్దని ఆ కారు ఆర్‌సీ కూడా మార్చకుండా తన నేరాలు కొనసాగించాడు ప్రభుత్వ వాహనం అయినందున పోలీసులు కూడా ఆపేవారు కాదు దాంతో చిన్న గూండా నుండి ఎదిగి ఇప్పుడు యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోయాడు. పోలీసులు ఈయనకు మిత్రులు, దాంతో ఈయనపై ఇప్పటివరకు 60 కేసులు నమోదైనా టాప్ క్రిమినల్ లిస్ట్ లో ఈయన పేరు చేరలేదు. ఈయన ఇంట్లో ఓ అండర్ గ్రౌండ్ బంకర్ ఉంటుంది అందులో ఏకే 47 గన్ ల తో పాటు 32 పోలీస్ పిస్టల్స్ ఉన్నాయి. ఇక ఈయన క్రైమ్ ఫైల్ తన చేతిలోకి వచ్చిన తరువాత అక్కడి డీఎస్పీ వికాస్ దుబే ను ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు దాంతో అటాక్ కు ప్లాన్ చేసి 16 మంది టీమ్ తో వెళ్ళాడు. కానీ ఈ నీచుడు ఇవన్నీ ముందుగానే తెలుసుకొని వచ్చిన పోలీసుల్లో 8 మందిని ఈయాన గ్యాంగ్ తో చంపించాడు. డీఎస్పీ కాళ్ళు గొడ్డలితో నరికి కాళి వేళ్ళు కత్తిరించారు. అనంతరం తన ముఠాతో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈయన పై కేసు నమోదు చేసుకొని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు యూపీ పోలీస్ వర్గాలు. ఈ కేసులో ఇప్పటికే 18 మంది పై కేసు నమోదు అయ్యింది అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఈయన జాడ చెప్పినా ఈయన గ్యాంగ్ ఆచూకీ చెప్పినా ప్రభుత్వం వారికి 50 వేల రివార్డ్ ను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version