గుప్పెడంతమనసు సెప్టెంబర్ 20 ఎపిసోడ్-247: రిషీపై మహేంద్ర ఆవేశం..నేను డాడ్ అయితే జగతి ఏమవుతుందని రిషీని నిలదీత

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి టీచర్స్ తో మాట్లాడుతూ ఉండగా అటెండర్ వచ్చి ఎండీసార్ రమ్మంటున్నారు అంటాడు. జగతి మనసులో రిషీ రమ్మన్నాడంటే ఏదైనా కొత్త సమస్య వచ్చిపడిందా, వసూ ఏదైనా కొత్త తలనొప్పి తయారుచేసిందా అనుకుని వెళ్తుంది. మధ్యలో మహేంద్ర కనపడతాడు. ఎక్కడికి అంటే చెప్తుంది. నేను రావొచ్చా అని అడిగితే వద్దులే నన్ను రమ్మనప్పుడు మీరు వస్తే బాగుండదని జగతి వెళ్తుంది. వసూ మెయిల్ పెట్టింది కదా దాని గురించా అనుకుంటూ వెళ్తుంది జగతి.

ఇంకోవైపు వసూ..దేవయాని మాటలు గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటుంది. గురదక్షిణగా మీరు అడిగింది నేను చెల్లించి మిమల్ని గెలిపస్తాను సార్ అనుకుంటూ ఉంటుంది..ఇంతలో కారు పక్కనుంచి వెళ్లటంతో బురద డ్రస్ మీద పడుతుంది. ఇటుపక్క జగతి రిషీ దగ్గరకు వెళ్తుంది. రీషీ కోపంగా చూస్తాడు. అసలేంటి మీ ఉద్దేశం, ఏమనుకుంటున్నారు మీరు, ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను, అన్నీ ప్లాన్ తోనే అమలు చేస్తున్నారా అని అడుగుతాడు. జగతి సార్ నేను ఏం తప్పు చేశానని ఇన్ని మాటలు అంటున్నారు అని అడుగుతుంది. ఈ కాలేజ్ కి వచ్చినప్పటి నుంచి నేను మీరు చేసిన పనులన్నీ చూస్తున్నాను. సార్ ప్లీజ్ నేను చేసిన తప్పేంటో చెప్పండి అని జగతి అడుగుతుంది. తప్పు మీది కాదు మేడమ్.. నా తప్పు. మీ కడుపున పుట్టటం నా తప్పు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో మీకు కొడుకుగా పుట్టాను, మీరు ఎన్ననుకున్నా, ఎన్ని కన్నీళ్లు కార్చినా కరిగిపోనూ అని మీకు తెలుసు, అందుకే మా డాడ్ వైపు నుంచి వస్తున్నారా, మా డాడ్ ని అడ్డంపెట్టుకుని పథకాన్ని అమలుచేస్తున్నారా అంటాడు.

ఏం చేశాను సార్ నేను అని జగతి అడుగుతుంది. ఇంకా ఏం చేయాలి మేడమ్..కాలేజ్ లో నా పరువు తీయాలని డిసైడ్ అయినట్లు ఉన్నారుగా, డాడ్ భుజం మీద తలవాల్చి అంటూ..ఆపేశ్తాడు. మీరు కేవలం ఫ్యాకెల్డీ హెడ్ గానే ఇక్కడ అందరికి తెలుసు, డాడ్ తో మీకు ఉన్న బంధం అందరికి తెలియాలనే కదా ఇదంతా చేస్తున్నారు. గ్రౌండ్ లో కలిసి నడుస్తారు, నవ్వుకుంటారు, తింటారు ఇలా ఉంటే అందరూ ఏమనుకుంటారు, మీ బంధాన్ని నేను ప్రశ్నించటంలేదు. కాలేజ్ లో ప్రదర్శించొద్దు అంటున్నాను..ఈ కాలేజ్ ని మీరు కలిసి తిరిగే పార్క్ లాగా మార్చొద్దు అంటున్నాను, మీ ఇద్దరి ఏకాంతానికి కాలేజే దొరికిందా అంటాడు..ఆ మాటకు మహేంద్ర కోపంగా నోర్ మూయ్ రా అంటాడు. ఫుల్ ఫైర్ లో ఉంటాడు మహేంద్ర. డాడ్ అంటాడు రిషీ..ఛీ నోర్ మూయ్ నన్ను డాడ్ అని పిలవకు అంటాడు మహేంద్ర.

డాడ్ ఏంటి మీరు మాట్లాడేది అంటాడు రిషీ..రేయ్ నేను డాడ్ అయితే తనేమవుతుంది నీకు అని గట్టిగా అరుస్తాడు..జగతి ఏడుస్తూ..మహేంద్ర ఏంటిది అంటుంది. జగతి నువ్వు మాట్లాడకు, నన్ను మాట్లాడని..ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే ఎందుకు పనికిరానివాడ్ని అవుతాను అంటాడు. జగతి డోర్ మూస్తంది. ఎందుకు జగతి డోర్ మూస్తున్నావ్, అందర్ని వినని అంటాడు. మిస్టర్ రిషేంద్ర బూషన్ సన్ ఆఫ్ మహేంద్రబూషన్ గ్రేట్ సార్ మీరు చాలా గ్రేట్..తల్లిని మేడమ్ అంటారు. ఈ మహాతల్లి కొడుకుని సార్ అని పిలుస్తుంది. ఇద్దరిమధ్య నన్ను జోకర్ గా నిలిపారు కదా అంటాడు. రిషీ భయంతో డాడ్ అంటాడు.. షట్ అప్ రిషీ అంటాడు మహేంద్ర. ఇందాకేమన్నావ్, ఈ కాలేజిని మేము పార్క్ లా మారుస్తున్నామా..కన్నకొడుకు కన్నతల్లిని ఈ మాట అనొచ్చా..ఒకవేళ అందరికి తెలిస్తే ఏంటంటా, తను నా భార్యే కదా, నీకు తల్లికదాని నువ్వు అంటే అనుకో రిషీ అంటాడు. జగతి మహేంద్ర ప్లీజ్..తనని బాధపెట్టకు అంటుంది. విన్నావా..ఇప్పటికి నువ్వు బాధపడతావనే చూస్తుంది, ఇది అమ్మంటే,అమ్మ ప్రేమంటే..కాదనుకున్న నీకేం తెలుస్తుందిలే కన్నతల్లి ప్రేమ అంటాడు మహేంద్ర. రిషీకి ఓ పక్క కోపం, బాధ వస్తుంది. జగతి..చిన్నవాళ్లకు దణ్నం పెడితే మంచిది కాదంటారు, లేకపోతే దణ్నం పెట్టిమరీ చెప్పేదాన్ని..నా వల్ల ఏదైన తప్పు జరిగితే నన్ను క్షమించండి సార్ అని చెప్పి వెళ్లిపోతుంది. మహేంద్ర రిషీ..మనిషిని చంపితే హత్య అంటారు, చంపిన వాడ్ని హంతకుడు అంటారు. మనసుని చంపితే ఏమంటారో నాకు తెలియదు, దానికి శిక్ష కూడా ఉండదు..ఈరోజు ఇద్దరి మనసుల్ని చంపేశావ్ అని చెప్పి వెళ్లిపోతాడు.

రిషీ మహేంద్ర మాటలను తలచుకుంటూ ఉంటాడు. జగతి కారు దగ్గరకు వెళ్తుంది. మహేంద్ర ఆపుతాడు. ఈ ప్రేమే రిషీకి నచ్చటం లేదు. నన్నువెళ్లని అంటుంది జగతి. మహేంద్ర.. ఎక్కడికి వెళ్తావ్ అంటే..భయపడకు మహేంద్ర..నేనేం చచ్చిపోనులే అంత పిరికిదాన్ని కాదు, ఇంటికే వెళ్తాను అంటుంది. మహేంద్ర వద్దని బతిమిలాడతాడు. జగతి వినదు. నేను జీవితంలో కుటుంబానికి దూరమయ్యాను, ప్రేమలకు దూరమయ్యాను,నాకు మిగిలిన ఏకైక స్నేహితుడివి, భర్తవి నువ్వే..ఇప్పుడు ఈ ప్రేమ కూడా నేను నోచుకునేలా లేదు..వద్దు మహేంద్ర నేను వెళ్తాను అంటుంది. మహేంద్ర మాత్రం..నువ్వు ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయటం మంచిది కాదని తనని కారులో ఎక్కించుకని తీసుకెళ్తాడు.

రిషీ మహేంద్ర అన్న మాటలను తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలా డాడ్ ఎప్పుడూ నా మీద అరవలేదు, ఇదంతా తనవల్లే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వసుధార వస్తుంది. వసూకి జరిగింది ఏం తెలియదుకదా..పాపం..అమాయకంగా వచ్చి మన బస్తీవిజిట్స్ చాట్స్ సార్ రాత్రంతా కుర్చోని చేశాను అంటుంది. రిషీ ఇప్పుడు కాదు అంటాడు. వసూ మళ్లీ చూడమంటుంది. రిషీ..కోపంగా చెప్తే అర్థంచేసుకోవేంటి అని లేచి ఫైల్ విసిరేస్తాడు. ఎంతసేపు నీ ధోరణి నీదేనా, చెప్తే వినవా అని అరుస్తాడు. వసూ ఏడుపుముఖం వేసుకుని నేను ఏమన్నాను సార్ అంటుంది. నా మాటను వినమంటున్నాను, వెళ్లమంటున్నాను కదా అని.. పరీక్షల్లో మార్కులు వస్తే సరిపోదు, ఎదుటివారి మూడ్ ని కూడా తెలుసుకోవాలి అంటాడు. వసూ ఏడ్చూకుంటూ కిందపడిన ఫైల్స్ తీస్తుంది. వేరే ఫైల్స్ కూడా కిందపడటంతో అవికూడా వసూ తీయబోతుంది..రిషీ అక్కర్లేదు ఆఫీస్ బాయ్ తీస్తాడు అని చెప్తాడు. వసూ వెళ్లిపోతుంది అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో వసూ బాధగా ఆటోలో వెళ్తూ ఉంటుంది. రిషీ ఎదురువచ్చి వసుధార పదా అంటాడు. వసూ కోపంగా నేను ఎక్కడికి రానుసార్ అంటుంది. రిషీ పనుంది వెళ్దాం పదా అంటాడు. మీతో నాకేం పనిలేదని వసూ అంటుంది. సరే నువ్వు రాకపోతే నేనే నీతో వస్తాను అని రీషీ అదే ఆటో ఎక్కుతాడు. వసూ దిగిపోతుంది. సర్ దిగండి అంటుంది. రిషీ దిగను అంటాడు. ఇందాకేదో పనిఉందని అన్నారుగా అంటుంది వసూ..ఇందాకడిగితే రానన్నావ్ గా అంటాడు రిషీ. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version