గుప్పెడంతమనసు ఎపిసోడ్ 260: వసూకి మేకప్ వేసిన రిషీ..చూస్తూ ఉండిపోయిన వసుధార

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ ఫోన్ మాట్లాడి అలా నుల్చుంటాడు. అలా చూసే సరికి మహేంద్ర డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. అంతా విన్నారా అంటే కొంత విన్నాను అంటాడు మహేంద్ర.  మేడమ్ వస్తే షో సక్సస్ అవుతుందని మాత్రమే చెప్తాను, కాలేజ్ వేరు వ్యక్తిగత జీవితం వేరు అంటాడు రిషీ..ఇవన్నీ నాకేందుకు చెప్తున్నావ్, నేను అడగలేదు కదా అంటాడు మహేంద్ర. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.
మార్నింగ్ వసుధార రెడీ ఐ టెన్షన్ గా ఉంటుంది. జగతి రాగానే..వసూ మేడమ్ నేను రెడీ, అంతా సర్థుకున్నాను అంటుంది. జగతి టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్తుంది. ఇంతలో శిరీష్ వచ్చి, మోడమ్ వసూ డ్రస్ చాలా బాగుంది, సూపర్ గా డిజైన్ చేశారు అని డ్రస్ తీసి చూపెట్టబోతాడు..వసూ ఇప్పుడొద్దు, టైం అవుతుంది కాలేజ్ లో చూద్దాం అని మాట్లాడుకుని వెళ్తారు. కాలేజీలో మహేంద్ర ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు.  ఇంతలో రిషీ వస్తాడు. ఇవన్నీ మీరే చూసుకోవాలా, స్టూడెంట్స్ కి చెప్తే సరిపోతుందికదా అంటాడు. మహేంద్ర మన కాలేజ్ లో ఫంక్షన్ మనం చేస్తేనే సంతోషంగా ఉంటుంది అంటాడు. రిషీ సరే మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనాలి, యూత్ ఐకాన్ ఇంకారాలేదా అంటే వచ్చింది వెళ్లు అంటాడు. జగతి వస్తుంది. మహేంద్ర జగతి నవ్వుతూ మాట్లాడుకుంటారు.
లోపల ఉన్న వసుధార స్టేజిపై ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది. చూసుకోకుండా వచ్చి రిషీకి తగుల్తుంది. వసూ సారీ సార్ అంటుంది. చూసుకోవాలిగా అంటాడు రిషీ. అంటే నేను వెనక్కు నడుస్తున్నాను చూసుకోలేదు అంటుంది వసూ. ఓహో..నువ్వు వెనక్కు నడుస్తున్నాను, నేను ముందుకునడుస్తాను చట్టప్రకారం తప్పు నాదంటావ్ అంతేనా అంటాడు రిషీ..అలా లేదు సార్ అంటుంది. వసూ మనసులో రిషీ సార్ రాత్రి ఫోన్ మాట్లాడుతుంటే జగతి మేడమ్ వచ్చింది ఎలా కనిపెట్టారు అని అడిగితే అనుకుని ధైర్యం చేసి అడుగుతుంది. రిషీ అనుకున్నాను, నువ్వు ఈ డౌట్ రాత్రే అడుగుతావనుకున్నాను అని గాజుల సౌండ్ బట్టి తెలిసింది అంటాడు. వసూ మనసులో రిషీ సార్ మాములు వాళ్లు కాదు అనుకుంటుంది.
ఇంతలో జగతి-మహేంద్రలు లోపలికి వస్తారు. రిషీ స్టేజిపైన పనులుచేస్తుంటే..వసూ సార్ మీరు ఈ పనులెందుకు చేయాలి సార్ మేము చేస్తాం అంటుంది. రిషీ ఇందాక ఇదే ప్రశ్న మహేంద్రను అడిగినప్పుడు మహేంద్ర ఏదైతే చెప్పాడో..రిషీ ఇప్పుడు అదే వసూకి చెప్తాడు. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనమే పనులు చేసుకుంటాం కదా, ఇదీ అంతే అని..ఇది విని మహేంద్ర నవ్వుకుంటాడు. ఈ సీన్ భలే కామెడిగా ఉంటుంది.  అమ్మానా సుపుత్రా నాడైలాగే కాపికొట్టి వాడేస్తున్నావా అనుకుంటాడు. జగతి మహేంద్రతో బాగా చెప్పాడుకదా అంటుంది. హా చాలా బాగా చెప్పాడు అంటాడు మహేంద్ర. అలా వసూ-రిషీలు స్టేజిపై డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇంతలో శిరీష్ వస్తాడు. లేట్ అయింది. మేకప్ వేసుకోవాలి,రెడీ అవ్వాలి అని వసూ చేయ్ పట్టుకుని తీసుకెళ్తాడు. రిషీకి కోపం వస్తుంది. పక్కనే ఉన్న పుష్పని పిలిచి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అది ఇక్కడ కాదు అక్కడ పెట్టూ అంటూ గట్టిగా అరుస్తాడు. వసూకి అర్థమవుతుంది..రిషీ సార్ నన్నే అంటున్నారు., ఈ శిరీష్ కి చెప్తే అర్థంకాదు అనుకుంటుంది. జగతి- మహేంద్రలకు కూడా అర్థమవుతుంది.
మేకప్ రూంలో వసూ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. తను స్లోగా వేసుకోవంటంతో శిరీష్ తీసుకుని నేను వేస్తా అంటాడు. అలా స్టాట్ చేస్తాడు. ఏదో ఫోన్ వచ్చి శిరీష్ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. వసూకి మేకప్ వేసుకోవటం రాదేమో..ఏదో ఎక్కువైందబ్బా అనుకుంటూ అద్దంలో చూసుకుని వింత వింత ఎక్సప్రషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో రిషీ వస్తాడు. వసూ చూసి సార్ మీరెప్పుడు వచ్చారు సార్ అంటుంది. నీ ముకారవిందంలో నవరసాలు ప్రదర్శిస్తున్నప్పుడు అంటూ ఎటకారంగా అంటాడు. వసూ సిగ్గుపడుతుంది. ఏంటది అంటే మేకప్ సార్ అంటుంది. ఎవరీ మేకప్ చేసింది అంటే వసూ శిరీష్ అంటుంది. రిషీ ఇంతింత మేకప్ అవసరమా న్యాచురల్ గా ఉండాలి అంటూ వసూని కుర్పోపెట్టి మేకప్ వేస్తాడు. అసలు ఈ సీన్ హబ్బా ఏమన్నా ఉంటుందా..సూపర్ అసలు. వసూ రిషీ కల్లలోకి చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఈ శిరీష్ వచ్చేస్తాడు. సార్ మీరు వసూకి మేకప్ చేస్తున్నారా, వండ్రఫుల్ సార్, సూపర్ సార్ ఈ అద్భుతమైన క్షణాలను ఫొటో తీస్తాను సార్ అంటే..వద్దు వద్దు ఓవర్ చేయొద్దు, మేకప్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి రిషీ వెళ్లిపోతాడు.  శిరీష్ వసూతో సార్ అన్నది మేకప్ గురించే కదా అంటే..హా అంతే అంటుంది వసూ. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో మంచి మంచి హైలెట్ సీన్స్ ఉన్నాయి. రిషీ-వసూ కలిసి డ్యాన్స్ చేయటం అది చూసి మహేంద్ర మురిసిపోవటం. ఇంకా రిషీ వసూ దగ్గరకు వచ్చి బాగా చేశావ్ వసుధార అంటే వసూ రిషీ చేయుపట్టుకుని థ్యాంక్స్ చెప్తుంది. ఒక సెల్ఫీ తీసుకుందాం సార్ అంటే రిషీ ఓకే అంటాడు. ఈ సెల్ఫీ ఎవరికి చూపించను సార్ అంటుంది. కానీ మహేంద్ర చూస్తూనే ఉంటాడు. రిషీ నాకు డీబీఎస్టీ కాలేజ్ ముఖ్యం..నువ్వు కూడా అంతే ముఖ్యం అంటాడు. ఈ మాట విన్న మహేంద్ర రిషీయేనా ఇలా మాట్లాడేది అనుకుంటాడు. రేపు చూద్దాం ఎందకు రిషీ ఇలా అన్నాడో.

Read more RELATED
Recommended to you

Exit mobile version