గుప్పెడంతమనసు ఎపిసోడ్ 262: మనసులో మాట చెప్పేసిన రిషీ..నువ్వు నాకు ప్రత్యేకం అంటూ వసూకి ఇండైరెక్ట్ ప్రపోజ్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ రిషీ స్పీచ్ ను పొగుడుతూ ఉంటుంది. రిషీ థ్యాంక్స్ చెప్తాడు. అదరగొట్టేశారు సార్ మీరు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా షోలో అంత అనర్గలంగా ఎలా మాట్లాడారు సార్ అంటుంది. ఆరునెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లు అవుతారమే అంటారుగా అలానే నీతో ఉంటున్నానుగా నువ్వు చెప్పే ఉపన్యాసాలు, స్పీచ్లు బాగా పనికొచ్చాయ్ అంటాడు. ఊరుకోండి సార్ మీరు జీనియస్ అంటూ వసూ రిషీకి బిస్కెట్లు వేస్తూనే ఉంటుంది. కాన్సప్ట్ గురించి రోజు వింటున్నానుగా అందుకే చెప్పానులే అని, నువ్వు కూడా క్లాసికల్ డ్యాన్స్ బాగా చేశావ్ అంటాడు. అంటే వెస్ట్రన్ డ్యాన్ బాగా చేయలేదా సార్ అంటుంది.
ఒకటి బాగుంది అంటే ఇంకోటి బాలేదని కాదు, ఈ రెండిటిలో క్లాసికల్ బాగా చేశావ్ అని అర్థం అంటాడు. వసూ గతంలో కూడా డ్యాన్స్ వేసింది గుర్తుచేసుకుంటుంది. రిషీ ఏంటి అలా చూస్తున్నావ్ అంటాడు. మీరు ఇంతబాగా మాట్లాడినందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపింస్తుంది అంటుంది. ఏంటి మళ్లీ కాకి ఎంగిలి, కోయిల ఎంగిలి లాంటివి ఇస్తావా అంటాడు రిషీ. వసూ రిషీ చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్తుంది. మనోడు గతంలో థ్యాంక్స్ చెప్పటానకి వసూని కౌగిలించుకున్న సీన్ గుర్తుచేసుకుంటాడు. వసూ సార్ మరి నాకు ఏం గిఫ్ట్ ఇవ్వరా అంటుంది. అడిగి తీసుకుంటే అది గిఫ్ట్ ఎలా అవుతుంది అంటాడు. గిఫ్ట్ కాదు తూచ్..రిక్వస్ట్ అనుకోండి అంటుంది. ఏంటది అంటాడు రిషీ. ఈ గెటప్ లో ఒక సెల్ఫీ ప్లీజ్ అని ఫోన్ తీసుకోబోతుంది. రిషీ..హలో హలో అలాంటివేవి లేవు అంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి డోర్ దగ్గరే నిలబడి చూస్తాడు. వసూ ఈ ప్రోగ్రామ్ జ్ఞాపకంగా ఒక సెల్ఫీ దాచుకుంటాను సార్ అంటుంది. సరే ఒక కండీషన్ అంటాడు..ఏంటి సార్ అది ఎవరికి చూపించకూడదు అంతేగా అంటుంది వసూ. తెలివైనదానివే అంటాడు. ఇద్దరు సెల్ఫీ తీసుకుంటారు.
నువ్వు డ్యాన్స్ బాగా చేశావ్ అని కాదనలేకపోయాను అంటాడు. వసూ ఒకప్పుడు జగతి అన్న మాటలను గుర్తుచేసుకుంటుంది( రిషీ నీకు ఏ విషయంలో కూడా నో చెప్పుడ, ముందు కాదన్నా తర్వాత అవునంటాడు) . రిషీ మళ్లీ ఈ సెల్ఫీ ఎవరికి చూపించకూడదు అంటాడు. చూపించను సార్, గిల్లొట్టు వేయమంటారా అంటూ వసూ గిల్లబోతుంది. వద్దులే అంటాడు. స్టేజి పైకి వచ్చే ముందు మీకు భయం వేయలేదా అని వసూ అడుగుతుంది. శిరీష్ తడబడుతుంటే ఈ షో చప్పగా ముగుస్తుందేమో అనిపించింది, నువ్వు ఓడిపోవటం, నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు వసుధార..ఈ షో చివర్లో శిరీష్ తడబడటం, తను చెప్పలేకపోవటం ఇవన్నీ నువ్వు నీ ఓటమిగా భావిస్తామో అనిపించింది, అందుకే నేను వచ్చాను..తెలిసిందేదో కొంత మాట్లాడాను..నాకు డీబీఎస్టీ కాలేజ్ ముఖ్యం, ఇంకా నువ్వు కూడా అంతే ముఖ్యం వసుధార అంటాడు. అంతే ఆ మాటకు బయటున్న మహేంద్ర కళ్లు జిగేల్ మంటాయి. వసూ షాక్ అవుతుంది.
మహేంద్ర మనసులో రిషీయేనా ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. తొందరగా డ్రస్ చేంజ్ చేసుకుని రా బయటవెయిట్ చేస్తుంటాను అంటాను అని వెళ్లిపోతాడు. వసూ మనసులో రిషీ సార్ ఏంటి అంత మాటన్నారు, మాటవరసకు అన్నారా కావలనే అన్నారా అనుకుని గతంలో రిషీ నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగిన సీన్ గుర్తుచేసుకుంటుంది. ఛఛా తప్పుచేశాను ఆరోజే నేను కూడా నా మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగాల్సింది అనుకుంటుంది.
ఇంకోపక్క జగతి మహేంద్ర నడుచుకుంటూ వస్తారు. జగతి మేడమ్ హ్యాపీయోనా అంటాడు మహేంద్ర..ఫుల్ హ్యాపీ మహేంద్ర, ఈవెంట్ ఇంత సక్సస్ అవుతుందని అనుకోలేదు అంటుంది. మహేంద్ర ఇందాక రిషీ అన్న మాటలను తలుచుకుని జగతి జీవతింలో ఊహించనవి చాలా జరగుతుంటాయ్ అంటాడు. జగతి సంతోషంగా రిషీ స్టేజ్ మీదకు వచ్చిన సీన్ చెప్పి ఆనందపడుతుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటారు. తనకు ఎలాగో థ్యాంక్స్ చెప్పలేను అందుకే నీకు చెప్తున్నాను అంటుంది. సరే ఇక వెళ్దామా అంటే..వసూ వస్తుంది అంటుంది జగతి. వాళ్లిద్దరూ కలిసి వస్తారులో అని జగతిమహేంద్రలు వెళ్లిపోతారు.
కారులో వసూ- రిషీ వెళ్తూ ఉంటారు. వసూ ఇంకా స్టేజి స్పీచ్ ను తలుచుకుంటూనే ఉంటుంది. రిషీ ఆ సెల్ఫీ సీన్ గుర్తుచేసుకుంటాడు. వసూ సార్ మీకో మాట చెప్పాలి సార్ అంటుంది. ఏంటి మళ్లీ సెల్ఫీయా అంటాడు రిషీ. లేదు సార్, స్పీచ్ బాగా చెప్పారు థ్యాంక్స్ చెప్తుంది. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావ్ అనుకుంటూ మాట్లాడతారు..కట్ చేస్తే ఇద్దరూ రెస్టారెంట్ లో ఉంటారు. వెజ్ సూప్ ఆర్డర్ ఇస్తారు. వసూ తడబడుతూ…మొత్తానికి నా మీద నీ అభిప్రాయం ఏంటి సార్ అంటుంది. రిషీ మనసులో ఇలా అడిగేసింది ఏంటి అనుకుని..వసుధార నువ్వు అందరు అమ్మాయిలాంటిదానివి కాదు, సంథింగ్ స్పెషల్, నేను నీ ఒక్కదానితోనే ఈ మాత్రం ఫ్రీగా ఉండగలుగుతాను, నన్ను అర్థంచేసుకుంటావ్, గౌరవిస్తావ్, నా కోపాన్ని అప్పుడప్పుడు భరిస్తావ్..నువ్వు నాకు ప్రత్యేకం, నాకేంటి నువ్వు కాలేజ్ కి దొరికిన గొప్ప స్టూడెంట్ వి అందుకే నాకు ప్రత్యేకం అంటాడు. వసూ మనసులో పొంగిపోతూ అనవసరంగా అడిగానామో అనుకుంటుంది. రిషీ ఇది నీ కోసం అని నెమలీక ఇస్తాడు. వసూ సంతోషంగా థ్యాంకూ సార్ అంటుంది. ఇది మీకు ఎక్కడెది అంటుంది. రిషీ రెస్టారెంట్ లోనే ఇంతకముందు అడిగి తీసుకుంటాడు. ఇలాంటి అందమైన జ్ఞాపకాలు నీకు చాలా ఉంటాయ్ కదా అంటాడు. అందమైన జ్ఞాపకాలే అంతులేని సంపద సార్ అంటుంది. సూప్ వస్తుంది. ఇద్దరు తాగుతారు. ఇంతలో గాలికి నెమలీక ఎగిపోబోతుంది. అదేదో సినిమాలో దీపం ఆరిపోతుంటే హీరోహీరోయిన్స్ చేయి అడ్డంపెట్టినట్లు ఇద్దరు చేయ్ అడ్డుపెడతారు. ఈ సీన్ లో ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటారు.
ఇంకోసీన్ లో ఇంట్లో ప్రోగ్రామ్ గురించి ఫణీంద్ర దేవయానితో చెప్తాడు. మహేంద్ర- ఫణీంద్ర జగతిబాగా డిజైన్ చేశారు అనుకుంటూ మాట్లాడుతారు. అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రోగ్రామ్లో రిషీ పాత్ర ఏం లేదా అంటుంది దేవయాని అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో వసూ నెమలీకలను మంచిగా ఫొటో తీసి రిషీకి పంపుతుంది. రిషీ ఈ పొగరేంటి ఈ టైంలో ఫొటో పెట్టింది అనుకుని కాల్ చేస్తాడు. వసూ అప్పటికే పడుకుంటుంది. జగతి చూస్తుంది. వసూ నెమలీకను పట్టుకుని కలవరిస్తుంది. ఏంటి వసూ ఇలా అంటుంది అనుకుని కాల్ రావటంతో లిఫ్ట్ చేస్తుంది. రిషీ వసూ షోలో బాగా చేసింది..ప్రత్యేకందా అభినందించాలని కాల్ చేశాను అంటాడు. వసూ పడుకుంది సార్ మీ ప్రత్యేకమైన స్టూడెంట్ ని రేపు కూడా అభినందిచవచ్చేమో అంటాడు. మరీ రిషీ ఏం రిప్లై ఇస్తాడో రేపు చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version