గుప్పెడంతమనసు ఎపిసోడ్ 336: అంతా సర్ధుమణిగిన వేళ బాంబ్ పేల్చిన గౌతమ్..పొద్దున్నే అక్కడికి వెళ్లడంతో కోపంతో ఊగిపోయిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతిని రిషీ ఎందుకు వచ్చాడు, వసుధార విషయంలో నువ్విలా ప్రవర్తించడానికి రిషి కారణమా, ఏదో జరిగింది జగతి, అదేంటో నువ్వు చెప్పడం లేదు..నాకు సమాధానం కావాలి, నీ మొనం కాదు అంటే…నువ్వు అనుకున్నదే నిజం అనుకో మహేంద్ర, నీకు మనసుకు తోచిందే అనుకో అని జగతి చెబుతుంది. మనసు చంపుకోని ఏ పని చేయొద్దు, ఎవరికోసమో అర్థం లేని పనులు చేయొద్దన్న మహేంద్రతో ఒక్కోసారి మనకు కావాలిసిన వారికోసం ఎంతదూరమైనా వెళ్లాలి మహేంద్ర అంటుంది. దూరం వెళ్తే ఇంకా దూరం అయిపోతావ్ జగతి జాగ్రత్త అని మహేంద్ర అంటే..కాఫీ చల్లారిపోతుంది తాగు అంటుంది జగతి. కాఫీ బాగుంది జగతి, కానీ ఇక్కడ జరిగింది నువ్వు చేసింది అస్సలు బాగాలేదు అని చెప్పేసి వెళ్లిపోతాడు మహేంద్ర.

రిషీ ఇంట్లో

గౌతమ్ బొమ్మగీస్తూ ఉంటాడు, ఈ బొమ్మకళ్లు ఇంకా అందంగా రావాలిరా..కళ్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటూ ఇమాజిన్ చేసుకుంటాడు. రిషి కూర్చుని పొద్దున జరిగింది ఆలోచిస్తూ ఉంటాడు. అందమైన కళ్లు నన్ను కలవరపెడుతున్నాయ్ రా అని గౌతమ్ అనటంతో.. ఏంట్రా నీ కళ్లగోల అని చిరాకు పడతాడు రిషి. నువ్వు ఎప్పుడూ చిరాకుగానే ఉంటావ్ కదా మళ్లీ నేను కూడా అంటావేంటి అంటాడు గౌతమ్. ఇంతలో రిషికి మహేంద్ర కాల్ చేస్తాడు. నా మూడ్ బాలేదు..నన్ను ఎక్కడికి రమ్మని చెప్పొద్దు అంటాడు. మహేంద్ర నువ్వు అనుకున్నది సాధించావ్ కదా రిషీ..నువ్వు కోరుకున్నదే జరిగింది అని చెప్పేసి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేస్తాడు. రిషీ కంగారుగా లేస్తాడు. బొమ్మలో హెల్ప్ చేయి అన్న గౌతమ్ తో.. నీది రాతి హృదయంరా బాబు అంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. నువ్వు సాయం చేయకపోతే నేను గీయలేనా అని గౌతమ్ ఆ పనిలో పడతాడు.

జగతి ఇంట్లో

జగతి రోజూ కారు అలవాటైందా, రెస్టారెంట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి రావాలి అంటూ జగతి మేడం అన్న మాటలు, వసుధారా నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార. ఇంతలో జగతి అక్కడకు వస్తుంది..’నాకో విషయం అర్థం కావడం లేదు, నేను నిన్ను వెళ్లమన్నానే అనుకో వెళ్లిపోవడమేనా అలా ఎలా వెళతావ్ వసు.. అంటే నామీద నీకు గౌరవం లేదా… నువ్వు వెళతావని నేను ఊహించలేదు తెలుసా.. నా అంచనాలను తల్లకిందులు చేశావ్. అంటుంది. వసూ మేడమ్ అంటే..నేను మాట్లాడుతున్నాను కదా..నన్ను మాట్లాడనివ్వు.. నేను చెప్పాను సరే నా మనసు తెలుసుకోవాలి కదా’ అంటుంది. మీరెందుకు అలా ప్రవర్తించారని అడుగుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండదు..ఒక్కోసారి సమాధానం వెతుక్కుని వస్తుంది-ఇంకోసారి సమాధానాన్ని మనం వెతుక్కుని వెళ్లాలి అంటుంది జగతి. ఇప్పుడేం అడక్కు పడుకో అని జగతి వెళ్తుంది. వసూ మేడమ్ నాకొక విషయం అర్థమైంది..రిషి సార్ ఒక్కోసారి ఇలాగే ప్రవర్తిస్తుంటారు…మనం ఏదైతో అడగాలనుకుంటామో-ఆయన రివర్స్ లో మనల్ని అడుగుతారు..ఆయన ఎందుకిలా చేస్తారో నాకిప్పుడు అర్థంమైంది అంటుంది వసుధార. నా కొడుకే కదా అని జగతి వెళ్లిపోతుంది. తల్లీ-కొడుకులు ఒకేలా ఉన్నారు, ఏం అడిగినా చెప్పడం లేదు..అనుకుని నిద్రపోతుంది.

రిషి

రిషి ఫోన్లో వసుతో కలిసున్న ఫొటో చూసుకుంటూ.. వసుని హాస్టల్ కి పంపించేయమన్న విషయం-నువ్వు ఇక్కడే ఉండాలన్న విషయం గుర్తుచేసుకుని..నీ విషయంలో నా అంచనా తప్పింది.. నువ్వు ఇంతలా బాధపడతావని అనుకోలేదు.. అందుకే ఇప్పుడు సరిదిద్దుకున్నా అనకుంటాడు. పక్కనే వసుధార ఇచ్చిన గోళీల బాటిల్ చూసి మనోడు డ్రీమ్స్ లో కి వెళ్లిపోతాడు. నేను నీకు బాధను పంచాను కానీ నువ్వు నాకు జ్ఞాపకాలు పంచుతున్నావ్ అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ ఆ బాటిల్ లాక్కుని నివ్వింకా గోళీలు ఆడుతున్నావా అంటాడు. ఆ బాటిల్ నా పర్సనల్ ఇచ్చెయ్ అంటాడు. గౌతమ్ ఇది నీకు పర్సనల్ ఏంట్రా అంటే..ఇది నా సొంతం, నాది అంటూ లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు. నీది అయితే నాదిన్నట్లే కదరా అంటాడు గౌతమ్. ఇక్కడ గోళీల ప్లేస్ లో వసుధారని పెట్టి లాక్కునేట్టు చూపించాడు మన డైరెక్టర్.. ఒరేయ్ అందులో ఏమున్నాయి, ఓ 20 రూపాయలు పెడితే వస్తాయి కదా అన్న గౌతమ్ తో .. జ్ఞాపకాలను డబ్బుతో కొనలేం అంటాడు రిషీ. ఎవరు చెప్పార్రా ఈ కొటేషన్ అన్న గౌతమ్ తో..రిషీ ఎవరు చెప్తే ఏంట్రా.. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు పోగుచేసుకోవాలి, డబ్బులు మాత్రమే కాదు అంటాడు. షాకైన గౌతమ్.. ఒకవేళ ఈ బాటిల్ కొట్టేస్తే ఏం చేస్తావ్ రా అంటే.. చంపేస్తా అంటాడు రిషి. వసుధారతో జరిగిన ఘటనలన్నీ తలుచుకుని వసుధార నాకు బోల్డెన్ని అందమైన జ్ఞాపకాలు..నేను తనని బాధపెట్టాను, ఈ విషయం తనకి తెలుసో లేదో కూడా తనకి తెలియదు అనుకుంటాడు.

మరోపక్క వసూ రూమ్ కి వచ్చిన జగతి…. సారీ వసూ.. నిన్ను ఇబ్బంది పెట్టక తప్పలేదు అనుకుంటుంది. పక్కనే ఉన్న గోళీల బాటిల్, నెమలీకలను చూసి అది తీసుకెళ్తుంది. దానిపై కొటేషన్ రాసి అతికించి మళ్లీ అక్కడే పెడుతుంది.

సీన్ కట్ చేస్తే.. నిద్రలేచిన రిషి…రాత్రి డాడ్ కనిపించలేదేంటి లేట్ గా వచ్చారా అనుకుని బయటకు వస్తాడు. ధరణి మహేంద్ర జాగింగికి వెళ్లారని చెప్తుంది. నన్ను పిలవకుండా వెళ్లడమేంటనని అనుకుంటాడు.

నిద్రలేచిన వసుధార ఎదురుగా బాటిల్ కి అతికించి ఉన్న పేపర్ తీసి చదువుతుంది ‘ సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల ఇదో తీపి జ్ఞాపకాల జంపాల ‘ అది చూసిన వసుధార జగతి మేడం ఇది మీరు రాశారు కదా చాలా బావుందని చెబుతుంది. జగతి నిజంగా బాగుందా అంటే..చాలా బాగుంది మేడమ్.. ఇంత తక్కువ పదాలతో ఎంత మీనింగ్ ఉందో ఇందులో..మహేంద్ర సార్ కి మీకు మధ్య ఉన్న ప్రేమ ఇంత అందంగా అపురూపంగా ఉండేదా మేడం అని అడుగుతుంది. పొద్దున్నే ఈ టాపిక్ ఎందుకులే వసు..మళ్లీ దేవయాని అక్కయ్యని గుర్తుచేసుకోవడం ఇప్పుడు వద్దులే అంటుంది జగతి. థ్యాంక్యూ మేడం మీరు నాకు భలే ఆటోగ్రాఫ్ ఇచ్చారు ఇది నాకు మంచి గిఫ్ట్ లా ఫీలవుతా అంటుంది. జగతి త్వరగా రెడీ అవ్వు అని వెళ్లిపోతుంది. వసూ ఆ నెమలీకను రీషీ ఇచ్చిన సీన్ గుర్తుచేసుకుని..కాసేపు రిషి ఊహల్లో ఉంటుంది. వసుని చూసిన జగతి…. నువ్వు నీరు అయితే -రిషి నిప్పు, నువ్వు నిలకడగా ఉండే భూమి-నిలకడలేని గాలి, మీ ఇద్దరూ ఎంత దూరం వెళతారో, ఎప్పుడు బయటపడతారో తెలీదు అనుకుంటుంది జగతి. కొడుకు మనసేంటో తెలుసు..కానీ మనసెప్పుడు విప్పుతాడా అని ఎదురుచూసే తల్లిదండ్రులు మేమేనేమో అనుకుంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో..

రిషీ ఇంట్లో అందరూ టిఫెన్ చేస్తుంటారు. గౌతమ్ రాలేదేంటని అడుగుతాడు రిషి.. వసుధార దగ్గరకు వెళతా అన్నాడు అని చెబుతుంది ధరణి. మరోసీన్ లో గౌతమ్ వసూకి ఏదో పేపర్ ఇచ్చి సెల్ఫీ తీసుకుంటాడు. తింటున్న రిషి అక్కడి నుంచి లేచి వెళ్లి వసుకి కాల్ చేసి..గౌతమ్ ఎందుకొచ్చాడని అడుగుతాడు, ఇదంతా మహేంద్ర వినడంతో…ఏంటి డాడ్ గౌతమ్ ఇలా చేస్తున్నాడు, మీరైనా వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చుకదా అంటే.. నువ్వు చెబితేనో బావుంటుంది అంటాడు మహేంద్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version