పాత అనుభవాలు..కొత్తపాఠాలు..న్యూఇయర్ నుంచి మొదలెడదాం..!

-

మనం లవ్ లెటర్ లో రాసుకున్న పేరు..వెడ్డింగ్ కార్డులో కచ్చితంగా ఉండాలని లేదు. కొన్ని రిలేషన్స్ వర్క్ అవౌట్ కావని తెలిసి కూడా వాళ్లను ప్రేమిస్తాం. ఎందుకంటే కొద్దిరోజులైనా ఇష్టమైన వాళ్లతో గడపొచ్చని..ఇంకా..పెళ్లైనా అందరూ సంతోషంగా ఉన్నారని, ఉంటారనీ చెప్పలేం. వైవాహిక సంబంధాలు కడదాక అంతే ప్రేమానురాగాలాతో ఉండే రోజులు కావు ఇవి. గత ఏడాదిలో బ్రేకప్ బాధను అనుభవించిన వాళ్లు ఉన్నారు. విడాకులు తీసుకుని ఒంటరి జీవితం మొదలేసిన వాళ్లు ఉన్నారు. మన బతుకు ఇంతే అని తలవంచుకుని కుర్చంటే..బండి ముందుకు సాగదు. అందుకే ఆ అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటే ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. వాటిని పాజిటివ్‌గా మలచుకుంటూ కొత్త ఏడాదికి కొత్త ఉత్సాహంతో స్వాగతం పలికితే జీవితం మరింత హ్యాపీగా ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం.

అంచనాలు.. హద్దు దాటొద్దు!

ప్రేమలోనైనా, వైవాహిక బంధంలో అయినా మనకు ఎన్నో అంచనాలు పెట్టుకుంటాయి. భవిష్యత్తులో ఇద్దరం కలిసి అలా ఉండాలి.. ఈ పనులు చేయాలంటూ పెద్ద లిస్టే తయారుచేసుకుంటారు. అయితే అందులో అన్నీ జరగకపోవచ్చు. అలాగని అంచనాలు మితిమీరినా..వాటిని చేరుకోలేకపోయామన్న బాధ మనసును మెలిపెడుతుంది. బంధం బీటలు వారినప్పుడు ఈ వేదన రెట్టింపవుతుంది. అందుకే ఈ విషయాన్ని గ్రహించి.. ఇక నుంచైనా మనకు ఏవైతే సాధ్యమో వాటి గురించే ఆలోచించాలనుంటున్నారు నిపుణులు. తద్వారా అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్లుగా చేరుకోవడంతో ఆనందం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. ఇవి ఎలాంటి ప్రతికూలతల నుంచైనా మనల్ని బయటపడేసి సానుకూలత వైపు అడుగులేసేలా చేస్తాయి. మనం ఎప్పుడూ వేరేవాళ్ల దగ్గర నుంచి ఎక్కవుగా ఎక్స్పెట్ చేయొద్దు. అది భర్త అయినా, భార్య అయినా, లవర్ అయినా..మీరు ఎదుటివారి దగ్గర నుంచి ఎంత ఎక్కువ ఎక్స్పెట్ చేస్తే అంత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.

స్నేహితులే థెరపిస్టులు..

ఒక బంధం నుంచి విడిపోవటం అంటే..అంత చిన్న విషయం కాదు. సీరియస్ గా రిలీషన్ లో ఉన్నవారి నుంచి విడిపోతే అది చావుకంటే..ఘోరమైనా విషయం. అయితే ఈ క్రమంలో మానసికంగా ఒత్తిడికి గురవడం, ఆందోళన చెందడం చాలామందికి అనుభవమే! అలాంటప్పుడు స్నేహితుల్ని మించిన థెరపిస్టులు మరొకరు లేరంటున్నారు నిపుణులు. మనసులోని బాధ మరొకరితో పంచుకుంటేనే ఉపశమనం కలుగుతుందన్నట్లు.. బ్రేకప్‌ వల్ల కలిగిన బాధను, ఆ చేదు అనుభవాల్ని మీలోనే దాచుకోకుండా.. మీ ప్రాణ స్నేహితురాలితో పంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరడమే కాదు.. వాళ్లిచ్చే సలహాలు మీ మనసుకు మరింత ఊరట కలిగించచ్చు. అలా అని అందరికి చెప్పేయకండి. నమ్మకం కలిగిన స్నేహితులతోనే పంచుకోండి. ఇదే సూత్రాన్ని మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా పాటించారంటే సంతోషమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

నిందించుకోవద్దు!

నిజానికి జరిగిన విషయంలో మన తప్పు లేకపోయినా.. మనల్ని మనం నిందించుకోవడం సహజం. ఛీ నేను ఆరోజు అలా చేసి ఉండకపోతే..అసలు ఈరోజు ఇదంతా అయ్యిఉండేది కాదు అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటాం. నిజానికి ఈ ఆలోచనలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది.. అందులో ఎవరి తప్పు ఎంతుందో స్వీయ పరిశీలన చేసుకోవడం.. ఒకవేళ మీ తప్పుంటే అవతలి వారికి క్షమాపణ చెప్పడం.. లేకపోతే ‘అంతా మన మంచికే జరిగిందేమో’నని సానుకూలంగా స్పందించాలి… ఇవన్నీ ఇకపై మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేవే!

మరుపు మంచిదే!

జ్ఞాపకాల్ని మనసులోంచి ఎంత తొలగిద్దామన్నా పదే పదే అవే గుర్తొచ్చి మనసును వేధిస్తుంటాయి. వాటి నుంచి మనసును మళ్లించాలంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టాలి. కెరీర్‌, నైపుణ్యాలు, కుటుంబ సభ్యులు/స్నేహితులకు చోటు కల్పించాలి. తద్వారా గత జ్ఞాపకాల్ని మర్చిపోతూ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

అవకాశమొస్తే.. వదులుకోకండి!

అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు. ఒకసారి బ్రేకప్‌ అయినా, భర్తతో విడిపోయినా.. మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్దంగా ఉండలేరు. మరీ అలా ఉండడం మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు.. ప్రతిసారీ గతంలాంటి చేదు జ్ఞాపకాలు ఎదురుకాకపోవచ్చు కూడా! కాబట్టి ఇకపై అంతా మంచే జరుగుతుందన్న పాజిటివిటీవోతో స్టెప్ తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిలోని సానుకూలతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ అలాంటి మనిషే భవిష్యత్తులో తారసపడి.. మీరే కావాలనుకుంటే మాత్రం వదులుకోవద్దు.

హ్యాపీ న్యూఇయర్ అని విషెస్ చెప్పేవాళ్లు బోలెడుమంది ఉంటారు. కానీ నువ్వు నిజంగా మనసులో హ్యాపీగానే ఉన్నావా. ఒకవేళ గతఏడాది ఇలాంటి చేదు జ్ఞాపకాలు మీరు అనుభవించి ఉంటే..ఈ ఏడాది మొదటిరోజే వీటిని పాటించటం మొదలుపెట్టేయండి. లైఫ్ లో డబ్బులు ఎక్కువున్నా..ఇలాంటి బాధలు ఉంటే మాత్రం సంతోషంగా ఉండలేరు అన్నది ముమ్మాటికి నిజం.

Read more RELATED
Recommended to you

Exit mobile version