సత్యదేవ్, తమన్నా ల ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇటీవల ‘గాడ్సే’గా..తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. త్వరలో సత్యదేవ్ నటించిన లవ్ స్టోరి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి.

శాండల్ వుడ్(కన్నడ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’..డెఫినెట్ గా తెలుగులో హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇందులో సత్యదేవ్, తమన్నా భాటియాల రొమాన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలను ప్రకటించి వాయిదా వేసిన మేకర్స్ తాజాగా..ఈ సినిమాను రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్‌ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news