రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గురుకులాలు దారి తప్పుతున్నాయి. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యావ్యవస్థ గాఢీ తప్పింది. అటు ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరోవైపు గురుకులాల్లో భోజన వసతి, పుట్టేడు సమస్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు సైతం వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఇద్దరు విద్యార్థినిలు సైతం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దారుణ విషయం వెలుగుచూసింది. పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ కరువై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం దారి తప్పారు. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి గురుకులంలో విద్యార్థులు మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. మద్యానికి బానిసై మత్తులో విద్యార్థులు తూలుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/1863595567554642064