అల్లు అర్జున్‌పై అభిమానుల గుస్సా.. ఈవెంట్స్‌కు లేట్‌గా రావొద్దని చురకలు

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియన్ స్టాయి అయినప్పటి నుంచి బన్నీ బిహేవియర్ లో చాలా మార్పు వచ్చిందని, ఆయన మూలాలను మరిచి ప్రవర్తిస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు గర్వం నెత్తికి ఎక్కిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలాఉండగా, హైదరాబాద్‌లో సోమవారం రాత్రి పుష్ప-2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. దీనికి హీరో అల్లుఅర్జున్ ఆలస్యంగా రావడంతో అభిమానులు సీరియస్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ ఈవెంట్‌కి లేట్‌గా రావడంతో అప్పటికే ఫ్యాన్స్ వెళ్లిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ను చూసేందుకు 3 గంటల నుంచే వెయిట్ చేశామని, ఎంతకూ రాకపోవడంతో వెనుదిరిగినట్లు కొందరు పేర్కొన్నారు. ఇక స్టార్ హీరోలు ఈవెంట్‌కు లేట్‌గా రావడం మానుకోవాలని ఫ్యాన్స్ చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news